Push Ups: పుషప్స్ చేస్తే గుండెపోటు రాదా? నిజమేంటి?

ప్రతిరోజూ పుషప్స్‌ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వైద్యులు 1104 మందిపై చేపట్టిన అధ్యయనంలో రోజు 40 పుషప్స్‌ చేయడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గినట్లు వెల్లడించారు.

New Update
Push Ups: పుషప్స్ చేస్తే గుండెపోటు రాదా? నిజమేంటి?

Push Ups: ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యల్లో గుండెపోటు ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండె సంబంధిత సమస్యలు అందరినీ భయపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు మనకు ముందుగానే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి సకాలంలో వైద్యం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆహార నియమాలు పాటిస్తూ, యోగా, వాకింగ్, ఎక్ససైజ్ వంటివి కూడా చేయాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అలాంటి వాటిల్లో పుషప్స్ ఒకటి. పుషప్స్ చేస్తే గుండెకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం.

publive-image

పుషప్స్‌తో గుండె సేఫ్:

ప్రతిరోజు పుషప్స్ చేస్తే గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన నిపుణులు 1104 మందిపై చేసిన అధ్యాయంలో ఈ విషయం వెళ్లడైనది. ప్రతిరోజు 40 పుషప్స్‌లు చేయడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాయామం ఖర్చుతో లేనిది కాబట్టి ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు స్ట్రోక్ వంటివి కూడా తగ్గుతాయని వైద్యులు  చెబుతున్నారు. వీటితోపాటు నడక కూడా ఆరోగ్యానికి మంచిది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి నడకతో పాటు పుషప్స్‌లు చేస్తే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఆవుకు అవి తినిపిస్తే.. సంతానం, సంతోషం అన్నీ మీ సొంతం!

Advertisment
తాజా కథనాలు