Pushpa Raj Ganesha : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన 'పుష్పరాజ్' గణేశుడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ 'పుష్ప రాజ్' గణేశుడ్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ విగ్రహంలో పుష్పరాజ్ ఉంటే బాగానే ఉండేది. కానీ ఆయనతో పాటూ శ్రీవల్లిని కూడా కలిపి విగ్రహం తయారు చేయడంతో కొందరు అది కరెక్ట్ కాదని, దేవుడికే అవమానం చేస్తున్నారనే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

New Update
Pushpa Raj Ganesha : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన 'పుష్పరాజ్' గణేశుడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

Pushpa Raj Ganesha : 'పుష్ప 2' నుంచి రీసెంట్ గా విడుదలైన 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే' అనే ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆడియన్స్ ను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక కలిసి చేసిన ఐకానిక్ స్టెప్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఆ స్టెప్ ను చాలామంది సెలెబ్రిటీస్ రీ క్రియేట్ చేసి ఇన్ స్టా రీల్స్ లో పోస్ట్ చేశారు.

ఇక తాజగా ఇదే ఐకానిక్ స్టెప్ తో ఏకంగా గణేశుడినే తయారు చేశారు. దీనికి పుష్ప రాజ్ గణేష్ అనే పేరు పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ చేసుంటారని నెటిజన్స్ అంటున్నారు. అయితే గణేశుడి విగ్రహంలో పుష్పరాజ్ ఉంటే బాగానే ఉండేది.

Also Read : ‘మేం విడిపోతున్నాం’.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్

కానీ ఆయనతో పాటూ శ్రీవల్లిని కూడా కలిపి విగ్రహం తయారు చేయడంతో కొందరు అది కరెక్ట్ కాదని, దేవుడికే అవమానం చేస్తున్నారనే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా పుష్పరాజ్ గణేశుడి వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇదేమైనా పుష్పరాజ్ గణేశుడు మాత్రం అదిరిపోయాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు