Pushpa2 Song: పవన్ అభిమానుల మనస్సు దోచిన పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్ లో ఇది గమనించారా?

అందరూ ఎంతగానో ఎదురుచూసిన పుష్ప2 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్  కి  పవన్ అభిమానులు కనెక్ట్ అయిపోయారు. అసలు సాంగ్ లో ఏముంది? జనసైనికులతో అల్లు అర్జున్ జై కొట్టించుకునే లాంటి కంటెంట్ ఏమిటి? తెలియాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే! 

New Update
Pushpa2 Song: పవన్ అభిమానుల మనస్సు దోచిన పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్ లో ఇది గమనించారా?

Pushpa2 Song: పుష్ప..పుష్ప.. ఐకాన్ స్టార్ సందడి మామూలుగా లేదు. ఒక పక్క ఎన్నికల హడావుడి. మరో పక్క బన్నీ పుష్పరాజ్ హంగామా. దేవీశ్రీప్రసాద్ మళ్ళీ మాస్ టచ్ తో సూపర్ బీట్స్ తో తన సత్తా చూపించాడు. సుకుమార్ మార్క్ ఈరోజు విడుదలైన పుష్ప 2 ది రూల్ సినిమాలోని పుష్ప.. పుష్ప పాట(Pushpa2 Song) అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. లిరికల్ సాంగ్ లా రిలీజ్ చేసినా.. సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ ఎప్పుడు సినిమా వస్తుందా.. పూర్తి పాటను ఎప్పుడు థియేటర్లో చూసి సంబరాలు చేసుకుందామా అని మెగా అభిమానులంతా ఎదురుచూసేలా చేసింది పుష్ప.. పుష్ప సాంగ్. 

ఈ మధ్యకాలంలో బన్నీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ ఫాన్స్ కు మెగా ఫాన్స్ కు మధ్యలో పెద్ద గ్యాప్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం మోతెక్కుతోంది. దీంతో అల్లు అర్జున్ కు సంబంధించిన ఏ వార్త అయినా మెగా కాంపౌండ్ అభిమానులు ఓన్ చేసుకునే పరిస్థితి కనిపించలేదు. కానీ.. ఇప్పుడు పుష్ప2 పాట(Pushpa2 Song).. మళ్ళీ అల్లు అర్జున్ మావాడే అని మెగా అభిమానులు చెప్పుకునేలా చేసింది. దీనికి కారణం.. జనసేన.. పవన్ కళ్యాణ్.. ఏమిటి అలా డౌటనుమానంగా చూస్తున్నారు. పుష్ప సాంగ్ కి.. మెగా కాంపౌండ్ కి.. జనసేనకు లింక్ ఏమిటి అనే కదా.. అక్కడికే వస్తున్నాను. 

publive-image Image from T-sries video

Also Read: ‘పుష్పరాజ్’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఆ బీట్ వింటే గూస్ బంప్సే!

ఈ పాట బీట్ లో మునిగిపోయి.. బన్నీ డాన్స్ మూమెంట్స్ ఎంజాయ్ లో పడి సాధారణ ప్రేక్షకులు గమనించలేదు కానీ.. మెగా అభిమానులు మామూలోళ్లు కాదు కదా.. సరిగ్గా ఎన్నికల సమయంలో టైమ్  చూసి మా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి జై కొట్టేశాడు అని మురిసిపోతున్నారు. ఎందుకంటే, పాట(Pushpa2 Song)  చివరిలో ఐకాన్ స్టార్ చేసిన మూమెంట్ ఒకటి సరిగ్గా ఎన్నికలకి.. జనసేన గుర్తుకు అదేనండీ గాజు గ్లాస్ కి కనెక్ట్ అయిపోయింది. పుష్పరాజ్ డాన్స్ చేస్తూ టీ  గ్లాస్ పట్టుకుని రెండు తిప్పులు తిప్పి.. టీ గ్లాస్ పైకెత్తి.. కిందకి దింపి స్టైల్ గా టీ తాగుతూ స్టెప్ వేశాడు. అంతే.. మరి జనసైనికులకు జోష్ వచ్చేసింది. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ కోసం పెద్దగా ఎప్పుడూ బయటకు రాని అల్లు అర్జున్ ఒక్కసారిగా జనసేన గుర్తు గాజు గ్లాస్ పట్టుకునిట(Pushpa2 Song) మరీ డ్యాన్స్ చేయడం.. అదీ పవన్ స్టైల్ లో గ్లాస్ చేత్తో పట్టుకోవడం.. ఇది సరిగ్గా ఎన్నికల సమయం కావడంతో జనసైనికులే కాదు.. మెగా అభిమానులంతా వండర్ అయిపోతున్నారు. 

publive-image

నిజానికి ఇది కావాలని చేశారో.. లేదా కాకతాళీయంగా జరిగిందో కానీ.. ఎన్నికల సమయంలో పవన్ వెంటే మేమున్నాం అని బన్నీ డైరెక్ట్ గా చెప్పినట్టుగా అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇది కాకతాళీయంగా జరిగినా ఒక సిగ్నల్ అయితే.. పంపించేసింది. మెగా ఫ్యాన్స్ మధ్యలో ఇన్నాళ్లూ ఉన్న చిన్నపాటి గ్యాప్ చెరిగిపోయింది అని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. బన్నీ మళ్ళీ మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన అభిమానులను కూడా తనవైపు తిప్పేసుకున్నాడని చెప్పేసుకుంటున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు