Pushpa 2: 6 నిమిషాల సీక్వెన్స్ కోసం 60 కోట్లు.. పుష్ప 2లో 'గంగమ్మ తల్లి' స్టోరీ ఇదే..! అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది టీజర్. అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్ తో క్షణాల్లో మిలియన్ వ్యూస్ కొల్లగొట్టేశారు. మూవీలో 6 నిమిషాల ఉండే ఈ గంగమ్మ జాతర సీక్వెన్స్ దాదాపు 30 రోజులు షూట్ చేశారట. దీని కోసం 60 కోట్ల ఖర్చు చేశారట మేకర్స్ . By Archana 13 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రిలీజైన క్షణాల్లో మిలియన్లకు పైగా వ్యూస్ తో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ 'గంగమ్మ తల్లి' గెటప్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీని కోసమే ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ టీజర్ చూస్తున్నారని చెప్పడంతో ఆశ్చర్యమేమీ లేదు. అయితే సినిమాలో గంగమ్మ తల్లి జాతర, అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ కేవలం ఒక సన్నివేశం మాత్రమే కాదు దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అంతే కాదు సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట మేకర్స్. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. 'గంగమ్మ జాతర' జానపద కథలు, పురాణాల ప్రకారం గంగమ్మ తిరుపతి నగరంలోని శ్రీ తాతయ్యగుంట గ్రామదేవిగా పరిగణించబడుతుంది. చాలా కథలలో ఆమె వేంకటేశ్వర స్వామికి సోదరి అని కూడా చెప్పబడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుపతి వాటి పరిసర ప్రాంతాలను పాలగొందులు పరిపాలించినప్పుడు మహిళలపై అకృత్యాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఈ పాలెగొందులు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారని చెబుతారు. ఈ సమయంలో గంగమ్మ దేవత అవిలాల అనే గ్రామంలో జన్మించింది. పెరిగేకొద్దీ ఆమె చాలా అందమైన మహిళగా మారింది. పాలగొందులు గంగమ్మ దేవికి హాని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె తన శక్తులతో వాళ్ళ దాడులకు భయంకరమైన సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ పాలెగొందులు భయపడి పారిపోయి దాక్కున్నారని అంటారు. వాళ్ళను తరిమి కొట్టేందుకు గంగమ్మ తల్లి 'గంగా జాతర' ప్లాన్ చేసింది. ఈ జాతరలో వారం రోజుల పాటు వింత వేషధారణలు, గంగమ్మ తిరుగుతుంది. ఏడో రోజు పాలెగొందులు బయటకు రాగానే వారిని హత్య చేసింది గంగమ్మ. ఈ సంఘటనను స్మరించుకుంటూ, గంగమ్మ దేవి పట్ల భక్తిని చాటుకోవడానికి ఈ పండుగను నేటికీ జరుపుకుంటారు అక్కడి వాసులు. ఈ పండుగలో పురుషులు స్త్రీల వేషం వేస్తారు. వారిలాగే చీరలు, మేకప్, నగలు, విగ్గులు కూడా ధరిస్తారు. ఈ విధంగా వారు గంగమ్మ దేవి ,స్త్రీ పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఎన్నో నియమాలున్న ఈ జాతరలో ఏడు రోజులపాటు వివిధ రకాల వేషధారణలతో జనం కనిపిస్తారు. 'పుష్ప 2' టీజర్ లో అల్లు అర్జున్ కనిపించే గెటప్ జాతర ఐదవ రోజున వేసే 'మాతంగి వేషం' అని నివేదికలు సూచిస్తున్నాయి. 6 నిమిషాల సీక్వెన్స్ కోసం 60 కోట్లు టీజర్ లో అల్లు అర్జున్ బాడీ మొత్తం డార్క్ బ్లూ పెయింట్ వేసుకొని, చీర, నగలు ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే పుష్ప2 మూవీలో ఈ ఒక్క జాతర సీక్వెన్స్ షూట్ చేయడానికి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారంట మేకర్స్. సినిమాలో కేవలం 6 నిమిషాల నిడివి గల ఈ జాతర సీక్వెన్స్ దాదాపు 30 రోజులు షూట్ చేశారని. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం 60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. Also Read: Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే! #allu-arjun-pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి