Roja: రోజా పెద్ద చీటర్.. నా దగ్గర రూ.40 లక్షలు కొట్టేసింది.. మంత్రిపై కౌన్సిలర్‌ ఫైర్‌

పుత్తూరు మునిసిపాలిటీ కౌన్సిలర్ భువనేశ్వరి మంత్రి రోజా, ఆమె సోదరుడిపై సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డిమాండ్ చేశారని ఆరోపించారు. మంత్రి సోదరుడు కుమారస్వామిరెడ్డికి మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చానని చెప్పారు.

Roja: రోజా పెద్ద చీటర్.. నా దగ్గర రూ.40 లక్షలు కొట్టేసింది.. మంత్రిపై కౌన్సిలర్‌ ఫైర్‌
New Update

Minister Roja: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి రోజాకు ఊహించని పరిణామం ఎదరైంది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని వైసీపీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మంత్రి రోజా, ఆమె సోదరుడిపై సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని భువనేశ్వరి ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డికి మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చానని వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా, తాను చెల్లించిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని భువనేశ్వరి వాపోయారు.

ఇది కూడా చదవండి: అందరి జాతకాలు బయటపెడతా.. సినీనటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపిన సత్య అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తెలిపారు. తాము డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. కొన్ని వీడియోలను ప్రదర్శించారు. రోజా సోదరుడు కుమారస్వామి అనుచరుడు సత్య తన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. విడతల వారీగా డబ్బులు ఇచ్చామని.. ఒకసారి రూ.20 లక్షలు.. మరోసారి రూ.7 లక్షలు, ఇంకోసారి రూ.3 లక్షలు, మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు వివరించారు. రోజా సోదరుడు తమకు తిరిగి రూ.29 లక్షలు మాత్రమే ఇస్తామన్నారని.. అవైనా ఇవ్వమంటే అవి కూడా ఇవ్వడం లేదన్నారు. రెండో విడతలో ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పారని.. కానీ ఇంతవరకు తనకు అవకాశం దక్కలేదన్నారు. ఇప్పుడు అడిగితే ఎన్నికల తర్వాత పదవి ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారన్నారు. తమకు ఎన్నికల తర్వాత పదవి అవసరం లేదు.. తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని అడిగితే.. మంత్రి రోజా, ఆమె సోదరుడి నుంచి కనీసం స్పందన లేదన్నారు. రేపు, మాపు అంటూ తిప్పుకుంటున్నారన్నారు. మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకునే పరిస్థితి లేదన్నారు.


రిజర్వేషన్ల పేరుతో మోసం
తాను వైసీపీ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, రిజర్వేషన్ కూడా ఉండడంతో చైర్మన్ పదవి నీదేనని నమ్మించారని భువనేశ్వరి వివరించారు. కానీ, తన నుంచి డబ్బులు తీసుకుని కూడా చైర్మన్ పదవిని ఇతరులకు అమ్మేశారని ఆరోపించారు. మొదట్లో దీనిపై ప్రశ్నిస్తే రెండో విడతలో అవకాశం ఇస్తామని చెప్పారని, మరోసారి అడిగితే ఎన్నికల తర్వాత అవకాశం ఇస్తామని చెబుతున్నారని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళను అయిన తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రోజా మాకొద్దు!.. నగరి వైసీపీలో అసమ్మతి స్వరం
మంత్రి రోజాకు మంగళవారం దెబ్బ మీద దెబ్బలు తగిలాయి. మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. రోజాకు టిక్కెట్ ఇస్తే తాము పని చేసే ప్రసక్తే లేదని, కొత్త వారికి అవకాశం ఇస్తేనే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జడ్పీటీసీలు తేల్చిచెబుతున్నారు. మంగళవారం చిత్తూరు ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు. కక్ష సాధింపుతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వాపోయారు. అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా మంత్రి రోజా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జడ్పీటీసీలకు ప్రత్యేక గదులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ను నిలదీశామని వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు జడ్పీటీసీలు పేర్కొన్నారు.

#ap-minister-roja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe