Temple Dress Code: చిరిగిన జీన్స్, స్కర్టులతో ఆలయంలోకి రావొద్దు.. కొత్త డ్రెస్ కోడ్ అమలు!

పూరీలోని జగన్నాథ ధామ్ ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. షార్ట్‌లు, రిప్డ్ జీన్స్, స్కర్ట్ లేదా స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించి ఆలయాంలోకి ప్రవేశించడం నిషేధం. ఉల్లంఘించిన వారిపై దేవాలయం అడ్మినిస్ట్రేషన్ భారీ జరిమానా విధించనుంది.

New Update
Puri Jagannath Temple: కరోనా తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుని 4 ద్వారాలు !

మీరు జగన్నాథ ఆలయానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఒడిశాలోని పూరీ(Puri)లోని జగన్నాథ(Jagannath) ఆలయం(Temple)లోకి ప్రవేశించేందుకు కొత్త డ్రెస్ కోడ్‌ అమలు చేస్తున్నారు. ఎవరైనా షార్ట్‌లు, రిప్డ్ జీన్స్, స్కర్ట్ లేదా స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించి ఉంటే, ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబోమని ఆలయ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా జగన్నాథ ఆలయం భక్తుల బట్టల విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ జగన్నాథ దేవాలయం అడ్మినిస్ట్రేషన్ (SJTA) ఆదేశాలకు విరుద్దంగా నడుచుకున్న వారిపై భారీ జరిమానా పడనుంది.

ధోతీతో ఆలయంలోకి ఎంట్రీ:
చిరిగిన జీన్స్ లేదా స్కర్ట్‌లో జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకుంటే అక్కడ ఉన్న ఆలయ పరిపాలనా అధికారులు లోపలికి వెళ్లకుండా ఆపేస్తారు. ఆలయ నిర్వాహకులు న్యూఇయర్‌ నుంచి డ్రెస్‌ కోడ్‌ను అమలులోకి తెచ్చారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు భక్తులు మంచి దుస్తులు ధరించాలని ఆలయ అధికారి ఆదేశాలు జారీ చేశారు. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే పురుషులు ధోతీ, గంఛాలో, స్త్రీలు చీరలో ఎక్కువగా కనిపించారు.

వీటితో పాటుగుట్కా, పాన్ తినడం, ఆలయం లోపల ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడంపై పూర్తిగా నిషేధం విధించారు. నూతన సంవత్సరం సందర్భంగా రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున 1:40 గంటలకు భక్తుల కోసం ఆలయ తలుపులు తిరిగి తెరిచారు. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 3.5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారు. ఇక డ్రెస్‌ కోడ్‌ ఈ నిబంధనలను అమలు చేసేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కొత్త సంవత్సరం రోజున ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పోలీసులు తెలిపారు. పూరీ ఆలయం వార్షిక రథ యాత్ర లేదా రథోత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం హిందువులందరికీ, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయాలలో పవిత్రమైనది. రామానుజాచార్య , మధ్వాచార్య , నింబార్కాచార్య , వల్లభాచార్య, రామానంద లాంటి అనేక మంది గొప్ప వైష్ణవ సాధువులు ఈ ఆలయంతో సన్నిహితంగా ఉన్నారు. రామానుజులు ఆలయానికి సమీపంలో ఎమ్మార్ మఠాన్ని స్థాపించారు.. ఆదిశంకరాచార్య గోవర్ధన్ మఠాన్ని స్థాపించారు.

Also Read: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్ఠీఆర్ ట్వీట్
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు