Purandeswari: మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు: పురందేశ్వరి వాగ్దానాలన్నీ నెరవేర్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి. రాష్ట్రమంతా కల్తీ స్పిరిట్ ని సప్లై చేస్తున్నారని జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 08 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Purandeswari: వైసీసీ ప్రభుత్వంపై రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి కౌంటర్లు వేశారు. జగన్ ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉండాలంటారని అయితే, ఆ ఫ్యాన్ స్పీడు 150 పెట్టడంతో ఇంటి పైకప్పుతో పాటు చుట్టుపక్కల గోడలు కూడా పడిపోయే పరిస్థితి వచ్చిందని కామెంట్స్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుటమి పాలన ప్రజలకు అత్యవసరం పురందేశ్వరి పేర్కొన్నారు. Also Read: ఆ ఇద్దరి నేతలను రోడ్డుపై బట్టలు ఊడదీసి ఇలా చేయ్యాలి: రవికుమార్ వాగ్దానాలన్నీ నెరవేర్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి. రాష్ట్రమంతా కల్తీ స్పిరిట్ ని సప్లై చేస్తున్నారని ఆరోపించారు. గతంలో 150 రూపాయలకు దొరికే మద్యం బాటిల్ ఇప్పుడు 600 నుంచి 700 రూపాయలు ఆమ్ముతున్నారన్నారు. ప్రజల జీవితాలు ఎలా పోయినా పర్లేదు వీళ్ళ జేబులు మాత్రం నిండాలని విమర్శలు గుప్పించారు. Also Read: అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారు.. కొణతాల కీలక వ్యాఖ్యలు! రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. రూ 12.50 లక్షల కోట్లు అప్పు భారం ఆంధ్రప్రదేశ్ పై ఉందని వెల్లడించారు. ప్రాంతీయ విభేదాలను తీసుకొచ్చి మూడు రాజధానులతో ప్రజలను మూడు ముక్కలు చేద్దామని ఈ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఆత్తారింటికి దారేదీ సినిమాలాగా జగన్ ని నల్లమల్ల అడవుల్లో నిలబెట్టి మాట్లాడిస్తే ప్రతి చెట్టు ఆకు రాలిపోయి అడవి అంత నిర్మానుష్యంగా అయిపోతుందని ఎద్దేవ చేశారు. అంతా అబద్దల పుట్ట ఈ జగన్ అని దుయ్యబట్టారు. #purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి