Purandeswari: నకిలీ ఓట్లపై ఈసీకు ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి.! ఏపీలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు సహా ఓటరు జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈసీకు ఫిర్యాదు చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అధికార పార్టీ వైసీపీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. By Jyoshna Sappogula 14 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Purandeswari: ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం ఢిల్లీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కలిసారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై, దొంగ ఓట్ల అంశాలపై ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ కు అందజేసినట్లు వెల్లడించారు. Also Read: బెజవాడలో భగ్గుమన్న పాతకక్షలు.. నడిరోడ్డుపై దారుణ హత్య! ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లోనే 35వేల నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించి ఓట్లు పొందారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఎన్నికల కమిషన్ కు అందచేసినట్లు వ్యాఖ్యనించారు. అధికార పార్టీ వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని.. దొంగ ఓట్లు సహా అనేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారని.. దానికి సంబంధించిన ఆధారాలను ఈసీకి ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సానుకూలంగా స్పందించారని వివరించారు. వారు కొన్ని సందేహాలు అడిగితే తాము నివృత్తి చేశామన్నారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను పెన్ డ్రైవ్ లో ఈసీ కి అందజేసినట్లు వెల్లడించారు. తప్పనిసరిగా ఈసీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు భావించారు. విచారణ జరుపుతామని ఈసి చెప్పినట్టు తెలిపారు. తెలంగాణ సహా మొన్నటిదాకా ఐదు రాష్ట్రాల ఎన్నికల బిజీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏపీ వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కేంద్రీకరిస్తుందని ఆశిస్తున్నట్లు కామెంట్స్ చేశారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి