భూమి మీద అరుదైన వన్యప్రాణుల్లో పునుగుపిల్లి (Punugu Pilli) కూడా ఉంది. దీనిని ఇంగ్లీష్ లో టాడీ క్యాట్, సివియట్ క్యాట్ (Teddy cat is a civet cat) అని పిలుస్తారు. పునుగు పిల్లుల్లో దాదాపు 38 జాతుల వరకు ఉన్నాయి. ఆసియా రకానికి చెందిన ఈ పునుగు పిల్లులు ఒక విశిష్టతను కలిగి ఉంటాయి. వీటి గ్రంథుల నుంచి తైలం లభిస్తుంది. దీనిని పునుగు తైలం అంటారు. ఇదొక సుగంధ ద్రవ్యం. ఈ తైలాన్ని వేంటకేశ్వర స్వామి విగ్రహానికి పూస్తారు. ఈ పునుగు పిల్లి తైలం స్వామివారికి ఎంతో ఇష్టమైందని చెబుతుంటారు.
పూర్తిగా చదవండి..Punugu Pilli : పాతబస్తీలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షం…తిరుమల శ్రీవారికి ఈ వన్యప్రాణికి ఉన్న కనెక్షన్ ఇదే..!!
ఈ భూమ్మిద కనిపించే అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి పునుగు పిల్లి (Punugu Pilli). ఇది మామూలు ప్రాణి కాదు. ఈ పునుగు పిల్లికి తిరుమల శ్రీవారికి మధ్య చాలా కనెక్షన్ ఉంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు హైదరాబాద్ పాతబస్తిలో పునుగు పిల్లి ప్రత్యక్షమైందట. పునుగుపిల్లిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వన్యప్రాణిని పట్టుకున్న సిబ్బంది జూపార్క్ కు తరలించారు.
Translate this News: