Punugu Pilli : పాతబస్తీలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షం...తిరుమల శ్రీవారికి ఈ వన్యప్రాణికి ఉన్న కనెక్షన్ ఇదే..!!

ఈ భూమ్మిద కనిపించే అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి పునుగు పిల్లి (Punugu Pilli). ఇది మామూలు ప్రాణి కాదు. ఈ పునుగు పిల్లికి తిరుమల శ్రీవారికి మధ్య చాలా కనెక్షన్ ఉంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు హైదరాబాద్ పాతబస్తిలో పునుగు పిల్లి ప్రత్యక్షమైందట. పునుగుపిల్లిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వన్యప్రాణిని పట్టుకున్న సిబ్బంది జూపార్క్ కు తరలించారు.

New Update
Punugu Pilli : పాతబస్తీలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షం...తిరుమల శ్రీవారికి ఈ వన్యప్రాణికి ఉన్న కనెక్షన్ ఇదే..!!

భూమి మీద అరుదైన వన్యప్రాణుల్లో పునుగుపిల్లి (Punugu Pilli) కూడా ఉంది. దీనిని ఇంగ్లీష్ లో టాడీ క్యాట్, సివియట్ క్యాట్ (Teddy cat is a civet cat) అని పిలుస్తారు. పునుగు పిల్లుల్లో దాదాపు 38 జాతుల వరకు ఉన్నాయి. ఆసియా రకానికి చెందిన ఈ పునుగు పిల్లులు ఒక విశిష్టతను కలిగి ఉంటాయి. వీటి గ్రంథుల నుంచి తైలం లభిస్తుంది. దీనిని పునుగు తైలం అంటారు. ఇదొక సుగంధ ద్రవ్యం. ఈ తైలాన్ని వేంటకేశ్వర స్వామి విగ్రహానికి పూస్తారు. ఈ పునుగు పిల్లి తైలం స్వామివారికి ఎంతో ఇష్టమైందని చెబుతుంటారు.

publive-image

తిరుమలలో శుక్రవారం స్వామివారి అభిషేకం అనంతరం..మూలవిరాట్ కు పునుగు తైలాన్ని లేపనంగా పూస్తారు. ఈ తైలం (punugu pilli thailam) కారణంగానే స్వామి విగ్రహం చెక్కుచెదరకుండా నిగనిగలాడుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీవారి తల నుంచి పాదాల వరకు పునుగు పిల్లి (Punugu Pilli) తైలాన్ని పులుముతారు. ఇలా చేయడం వల్ల శ్రీవారి విగ్రహానికి ప్రకాశమూ తగ్గదు. అయితే పునుగు పిల్లికి రెండేళ్లుగా రాగానే ప్రతిరోజు ఒకసారి గంధం చెట్టుకు తన శరీరాన్ని రద్దుతుంది. ఆ సయమంలో దీని చర్మం నుంచి వెలువడే స్రావం గంధం చెట్లకు అంటుకుంటుంది. ఆ చెట్ల నుంచి సేకరించే స్రావమే పునుగు తైలం.

కాగా ప్రస్తుతం అంతరించిపోతున్న ఈ అరుదైన వన్యప్రాణి పునుగు పిల్లులను టీటీడీ సంరక్షించి వాటి నుంచి తైలాన్ని సేకరిస్తోంది. అంతేకాదు పునుగు పిల్లులు (punugu pilli) విసర్జించే కాఫీ గింజలకు కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. పండిన కాఫీ పండ్లను తిని గింజలు విసర్జిస్తాయి. ఈ గింజలను సేకరించి పొడి చేసి విక్రయిస్తుంటారు. ఈ కాఫీ పొడికి మార్కెట్లో కిలోకు రూ. 25వేలకు పైగానే ధర ఉంటుంది. ఈ సివియట్ కాఫీని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు.

ఇప్పుడు పాతబస్తీలో పునుగు పిల్లి కనిపించిందంటే టీటీడీ అధికారుల సంబురం మామూలుగా ఉండదు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుంటారు. జాగ్రత్తగా దానిని తిరుమలకు తీసుకెళ్తారు. తిరుపతి ఎస్వీ జూపార్కులో ఉంచి సంరక్షిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు