ఆ బిల్లు ఆమోదం పొందితే... ఇక వివాహాలకు 100 మంది గెస్టులు, 10 డిషెస్ కు మాత్రమే అనుమతి....!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. అందుకే వధూవరులు తమ వివాహాన్ని ఓ వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు. అందుకే గ్రాండ్ లుక్ కోసం లక్షలు ఖర్చు పెట్టి వివాహ వేదికనను డెకరేట్ చేయిస్తారు. వందలాది మంది గెస్టులను పిలిచి తమ హోదాను ప్రదర్శించేలా విందు భోజనాలు ఏర్పాటు చేయిస్తుంటారు. గిఫ్టుల పేరిట లక్షలు ఖర్చు చేస్తుంటారు.

ఆ బిల్లు ఆమోదం పొందితే... ఇక వివాహాలకు 100 మంది గెస్టులు, 10 డిషెస్ కు మాత్రమే అనుమతి....!
New Update

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. అందుకే వధూవరులు తమ వివాహాన్ని ఓ వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు. అందుకే గ్రాండ్ లుక్ కోసం లక్షలు ఖర్చు పెట్టి వివాహ వేదికనను డెకరేట్ చేయిస్తారు. వందలాది మంది గెస్టులను పిలిచి తమ హోదాను ప్రదర్శించేలా విందు భోజనాలు ఏర్పాటు చేయిస్తుంటారు. గిఫ్టుల పేరిట లక్షలు ఖర్చు చేస్తుంటారు.

ఇదంతా చూస్తే ఒక్కో సారి ఇంతా వృధా ఖర్చు అవసరమా అనిపిస్తుంది. ఆ డబ్బేదో నిరు పేదలకు పంచితే బాగుంటుంది కదా అని చాలా మంది అనుకుంటారు. ఇక భోజనాల పేరిట వేస్ట్ చేసే బదులు ఆకలితో వున్న కొద్ది మందికైనా అన్నం పెడితే సరిపోతుందని అనుకుంటాం. కానీ ఇలా చెబితే వినే వాళ్లు ఎవరు. అందుకే దీనికి ఓ చట్టం ఉంటే బాగుండు అనుకున్నారో ఏమో పంజాబ్ కు చెందిన ఓ ఎంపీ లోక్ సభలో ఈ మేరకు లోక్ సభలో ఈ రోజు ఓ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టారు.

వివాహానికి 100 మంది అతిథులకు మించి పిలవ కూడదని బిల్లులో ప్రతిపాదించారు. ఇక భోజనాల్లో పది రకాల కూరలకు మించి వడ్డించకూడదని తెలిపారు. ఇక గిఫ్టులపై రూ. 2500 వరకు మాత్రమే ఖర్చు చేయాలని బిల్లులో సూచించారు. ఈ విధానాన్ని తన కూతురు, కుమారుడి పెండ్లిలో అమలు చేశానని ఆయన పేర్కొన్నారు. ఇలా చేస్తే వివాహాల్లో వృధా ఖర్చును తగ్గించి వాటిని ఏదైనా సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చన్నారు.

ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. ఇది ప్రైవేట్ బిల్లు కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించదు. రాజ్యాంగం ప్రకారం... పార్లమెంట్ లో ఏదైనా ఒక సభలో ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందితే వెంటనే ప్రభుత్వం కూలి పోతుంది. అందువల్ల ఈ బిల్లు పొందే అవకాశాలు లేవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి