వరదమ్మ కలిపింది ఇద్దరినీ.....!

పాటియాలలో వరదలు ఇద్దరు కుటుంబ సభ్యులను ఒక చోటికి చేర్చాయి. వరదలు 35 ఏండ్ల తర్వాత తల్లి కొడుకులను కలిపాయి. దీంతో తల్లి కొడుకులిద్దరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ దృశ్యాలను చూసి చుట్టు పక్కల వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.

వరదమ్మ కలిపింది ఇద్దరినీ.....!
New Update

వరదలు విషాదం సృష్టిస్తాయి. వరదలు విధ్వంసం సృష్టిస్తాయి. ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేస్తాయి.. ఇది మనందరం అనుకునే మాట. కానీ వరదలు కూడా కుటుంబ సభ్యులను కలుపుతాయని తెలుసా. వరదలు కూడా కుటంబాన్ని సంతోషంలో ముంచెత్తుతాయని తెలుసా. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతాయని తెలుసా... తెలియదా. అయితే ఈ వార్త చదవండి.

జగదీప్ సింగ్... పంజాబ్ కు చెందిన వ్యక్తి.. గతంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఎంతో మందిని వరదల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ఆయనకు తెలిసినంత వరకు వరద అంటే ఓ విషాదం. కానీ అదే వరద తన జీవితంలో సంతోషాన్ని నింపుతుందని, అదే రెస్క్యూ ఆపరేషన్ తన తల్లిని తన దగ్గరకు చేరుస్తుందని ఆయన ఊహించలేదు.

ఇంతకు ఏం జరిగిందంటే.... జగదీప్ సింగ్ ఆరేండ్ల వయసులో ఆయన తండ్రి మరణించారు. ఆ తర్వాత ఆయన తల్లి మరో వివాహం చేసుకుంది. దీంతో జగదీప్ సింగ్ ను ఆయన నానమ్మ-తాతలు తమతో పాటు తీసుకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తల్లి దండ్రులు మరణించారని చెబుతూ జగదీప్ సింగ్ ను నానమ్మ-తాతలు పెంచుకుంటూ వచ్చారు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అనుకోకుండా జగదీప్ సింగ్ కు ఆయన అత్తమ్మ కనిపించింది. మాటల సందర్బంలో జగదీప్ సింగ్ కు ఆయన తల్లి విషయం చెప్పింది. పాటియాలలో ప్రాంతంలో ఆయన అమ్మమ్మ-తాతయ్యలు వుండే వారిని చెప్పింది. దీంతో ఆయన తన తల్లి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల పాటియాలలో వరదలు వచ్చాయి.

వరద సహాయక చర్యల కోసం జగదీప్ సింగ్ ను ప్రభుత్వం పాటియాలకు పంపించింది. దీంతో ఆయన అక్కడకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాడు. ఆ సహాయక చర్యలో జగదీప్ సింగ్ తన తల్లిని చేరుకోగలిగారు. పునరావాస కేంద్రాల దగ్గర బాదితుల పేర్లు నమోదు చేస్తుండగా ఆమె వివరాలను తెలుసుకున్నాడు. దీంతో సుమారు 35 ఏండ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడంతో ఆనందంంతో పొంగిపోయాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe