/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-25T151904.549.jpg)
Pune car accident: పూణె కారు ప్రమాదం కేసులో బాల్య నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతన్ని తన తండ్రి సంరక్షణలోకి పంపించాలని కోర్టు ఆదేశించింది. సైకాలజిస్ట్‌తో మైనర్ సెషన్‌లను కొనసాగించాలని ఆదేశించింది.\
Bombay High Court grants bail to the juvenile accused in the Pune car accident case. pic.twitter.com/W6MRyW1OBJ
— ANI (@ANI) June 25, 2024
మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌లో అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ మైనర్ తండ్రి తరపున కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. గతవారం న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే బెయిల్ మంజూరు చేసిన తర్వాత మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు రిమాండ్ చేయడం బెయిల్ ఉద్దేశ్యాన్ని రద్దు చేస్తుందని తెలిపారు. 'ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ గాయం, అన్యాయం ఉంది. కానీ ఆ చిన్నారి (జువైనల్) కూడా తీవ్ర ఒత్తడిలో ఉన్నాడు' అని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి:NEET Updates: NEET కేసులో 25 మంది అరెస్ట్.. ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ!
ఇక మే 19వ తేదీ తెల్లవారుజామున పుణెలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లను వేగంగా వచ్చిన పోర్షే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ ఇంజినీర్‌లు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్‌కు జువైనైల్ బోర్డు తొలుత బెయిల్ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా బెయిల్‌పై తీవ్ర నిరసన రావడంతో తర్వాత మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపిస్తూ ఆదేశాల్లో మార్పు చేసిన విషయం తెలిసిందే.