YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. వివేకా హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీత్ యాదవ్ సమీప బంధువు భరత్ కుమార్ యాదవ్. గతంలో వివేకా హత్య కేసులో ఇతడిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తాజాగా ఈయన మీడియా సమావేశం నిర్వహించి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దస్తగిరి అతనోక హీరోలా ఫీల్ అవుతున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. వివేకాను తానే హత్య చేసానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడని కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకాని అత్యంత కిరాతకంగా చంపి సీబీఐ అధికారులకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తగిరి, సునీల్ యాదవ్ డబ్బులు విషయంలో గొడవ ఉందని..ఈ విషయాన్ని తన వద్ద ప్రస్తావన తీసుకువచ్చే వారని అన్నారు. వాళ్ళిద్దరూ వివేకానంద రెడ్డిని చంపిన విషయంలో డబ్బులు వస్తాయనే విషయంపై తనతో చర్చించే వారన్నారు.
Also Read: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..
సునీత సహకారంతోనే దస్తగిరి ఇలా చేస్తున్నాడని.. దస్తగిరి ఎస్కార్ట్ సపోర్ట్ చూసుకొని రౌడీయిజం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రాణహాని ఉందన్న వ్యక్తి బయటికి వెళ్లకుండా ఉండాలని కానీ, ఎందుకు రౌడీయిజం చేస్తున్నాడని ప్రశ్నించారు. దస్తగిరికి వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ నుంచి వస్తుందో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ వివేకా రెండో భార్యను వైఎస్ కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగిందని.. రెండో భార్యకు ఆస్తి మొత్తం వెళుతుందనే ఉద్దేశంతోనే హత్య జరిగి ఉండొచ్చన్నారు.
దస్తగిరికి ప్రతి ఒక్క విషయం తెలుసన్నారు. సునీల్, ఎర్రగంగిరెడ్డి లకు హెడ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డేనని పేర్కొన్నారు. దస్తగిరి ఒక ఆటో డ్రైవర్ అని.. తరువాత వైఎస్ వివేకా డ్రైవర్ గా పని చేస్తూ వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. బాత్రూంలో బెడ్రూంలో బ్లడ్ క్లీన్ చేయడం, బాడీని బెడ్రూంలోకి తీసుకుని రావడం విషయాలన్నీ ఎర్రగంగి రెడ్డికి బాగా తెలుసని కామెంట్స్ చేశారు. దస్తగిరి తనకు రూ. 16 లక్షలు బాకీ ఉన్నాడని అన్నారు.