BIG BREAKING: రాజకీయ పార్టీలు, దాతల మధ్య లింకులను బయటపెట్టండి.. ఎలక్టోరల్ బాండ్ డేటాపై సుప్రీం ఆదేశాలు!

రాజకీయ పార్టీలు, దాతల మధ్య సంబంధాన్ని వెల్లడించే ఎలక్టోరల్ బాండ్ డేటాను ప్రచురించాల్సిందేనని ఎస్‌బీఐ(SBI)కి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లలోని పూర్తి సంఖ్యలను ఎస్‌బీఐ వెల్లడించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతిస్పందన కోరుతూ సుప్రీంకోర్టు SBIకు నోటీసు జారీ చేసింది.

BIG BREAKING: రాజకీయ పార్టీలు, దాతల మధ్య లింకులను బయటపెట్టండి.. ఎలక్టోరల్ బాండ్ డేటాపై సుప్రీం ఆదేశాలు!
New Update

సుప్రీంకోర్టు వరుస ఆదేశాలు, తీర్పులతో రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ డేటాను ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందేనని ఎస్‌బీఐకి మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు తాజాగా మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య సంబంధాన్ని వెల్లడించే ఎలక్టోరల్ బాండ్ డేటాను ప్రచురించాల్సిందేనని ఎస్‌బీఐ(SBI)కి సుప్రీంకోర్టు ఆదేశించింది. దాతలను-గ్రహీతలకు లింక్ చేసే ఎలక్టోరల్ బాండ్ నంబర్‌లనుతప్పనిసరిగా వెల్లడించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

--> ఎలక్టోరల్ బాండ్ నంబర్‌లను వెల్లడించనందుకు, తద్వారా గతంలో ఇచ్చిన తీర్పును పూర్తిగా పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి సుప్రీంకోర్టు  నోటీసు జారీ చేసింది. 

--> ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ , జస్టిస్ సంజీవ్ ఖన్నా , జస్టిస్ బిఆర్ గవాయ్ , జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్లలోని పూర్తి సంఖ్యలను ఎస్‌బీఐ వెల్లడించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మార్చి 18 అంటే సోమవారం నాటికి ప్రతిస్పందన కోరుతూ సుప్రీంకోర్టు ప్రభుత్వ రంగ బ్యాంకు(SBI)కు నోటీసు జారీ చేసింది.

--> మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల డేటాకు సంబంధించిన సీల్డ్ కవర్‌పై ఎలాంటి రికార్డు లేకపోవడంతో వాటిని తిరిగి ఇవ్వాలని ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీల్డ్ కవర్‌లో రాజకీయ పార్టీల దాతల వారీగా వివరాలను పంచుకుంది.

--> ఇక ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే పెద్దగా తెలియని లాటరీ కంపెనీ అతిపెద్ద దాత అని డేటా చెబుతోంది. ఫ్యూచర్ గేమింగ్ అండ్‌ హోటల్ సర్వీసెస్ అత్యధిక మొత్తంలో రూ. 1,368 కోట్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసింది. తర్వాత మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.966 కోట్లకు కొనుగోలు చేసింది.

ALso Read: రూ. 1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌ కింగ్‌ మార్టిన్ శాంటియాగో ఎవరు? ఆయన ED స్కానర్‌లో ఎందుకు ఉన్నాడు?

#supreme-court #electoral-bonds
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe