మానవ ఎముకల నుంచి జాంబీ డ్రగ్ .. శ్మశానాల్లో యముకలు మాయం చేస్తున్న దుండగులు! By Durga Rao 24 Apr 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో మానవ ఎముకలతో తయారు చేసిన సైకోయాక్టివ్ డ్రగ్స్ కలకం సృష్టిస్తున్నాయి. జాంబీ డ్రగ్ గా పిలుచుకునే ఈ డ్రగ్స్‌కు అలవాటు పడిన జనం అవయువ వైఫల్యంతో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత కొన్నేళ్లలోనే ఆ దేశంలో కుష్ డ్రగ్స్ వినియోగం ప్రబలంగా ఉంది. ఎంతగా అంటే ఈ డ్రగ్ తయారీ కోసం స్మశానాల్లో పాతిపెట్టిన శవాలను తవ్వి బయటకు తీసి ఆ మృతదేహాల నుంచి ఎముకల్ని సేకరిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇలా దేశంలో చాలా చోట్ల స్మశానాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. దీంతో సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆయన ఈ బయో డ్రగ్‌ను ‘డెత్ ట్రాప్’గా చెప్పారు . ఎందుకంటే ఈ డ్రగ్ ఇది తీసుకున్న వెంటనే విపరీతమైన మత్తు వచ్చేస్తుంది అది కొన్ని గంటలవరకు కొనసాగుతుంది. తరువాత రాను రాను ఆరోగ్యం పాడై అవయవ వైఫల్యానికి దారి తీస్తుంది. ఈ నేపధ్యంలో డ్రగ్‌ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ డ్రగ్‌కి బానిసైన వాళ్లను గుర్తించి వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చేలా అధికారులను ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకూ ఈ డ్రగ్ తీసుకుని చనిపోయిన వాళ్లకు సంబంధించి అధికారిక లెక్కలు ఏమీ వెల్లడికాకపోయినా కచ్చితంగా ఇది ప్రాణాంతకం అని తేల్చిచెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా 15 నుంచి 25 యేళ్ల వయసున్న పురుషులు కుష్ డ్రగ్‌కు బానిసలవుతున్నారు. ఆ దేశంలో ప్రజల రోజు సగటు ఆదాయం రూ.400. అయితే రోజుకు రూ.800 వరకు ఈ డ్రగ్‌పై ఖర్చు చేస్తున్నారు. మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉండడం వల్ల ఆ మేరకు సప్లై పెంచుతూ పోతున్నాయి ముఠాలు. డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా చేసేందుకు స్మశానాల్ని టార్గెట్‌గా పెట్టుకుని అస్థిపంజరాల్ని చోరీ చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ తయారు చేయకుండా నిరోధించడానికి శ్మశానవాటికలలో పోలీసు బలగాలను మోహరింపజేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. #drugs #west-african-country మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి