Janasena: అవనిగడ్డలో జనసేన నిరసన ర్యాలీ..

కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేనలో అసంతృప్త జ్వాల కనిపిస్తోంది. మండలి బుద్ధప్రసాద్‌ చేరిక నేపథ్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు జనసేన నేతలు. జనసేనకు కేటాయించిన సీటు జనసేన పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.

Janasena: అవనిగడ్డలో జనసేన నిరసన ర్యాలీ..
New Update

Janasena Rally: కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేన నేతలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. మండలి బుద్ధప్రసాద్‌ చేరిక నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కండువాలు మార్చే రాజకీయం మాకు వద్ధంటూ నినాదాలు చేశారు. జనసేనకు కేటాయించిన సీటు జనసేన పార్టీ అభ్యర్థికే ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. కండువాలు మార్చే రాజకీయం నశించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిన్న అవనిగడ్డకు బ్లాక్ డే నని కామెంట్స్ చేశారు.

Also Read: చంద్రబాబు చెత్త నా కొడుకు.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో వాసుపల్లి గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు

బుద్ధ ప్రసాద్ నైతిక విలువలు కోల్పోయాడని కామెంట్స్ చేశారు. 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీని వదిలి 6 శాతం ఓటింగ్ ఉన్న పార్టీలోకి వెళ్ళనని చెప్పాడన్నారు. జనసేన చిన్నపిల్లల పార్టీ అని అందరి దగ్గర బుద్ధ ప్రసాద్ అవహేళన చేశాడని మండిపడ్డారు. డబ్బులు లేవన్న వ్యక్తికి ఈ రోజు డబ్బులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్, జనసైనికులు ప్రోత్సహించరని విక్కుర్తి శ్రీను పేర్కొన్నారు.

#janasena-protest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe