Producer Radhakrishna's Mother Passed Away : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. హారిక హాసిని నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తల్లి నాగేంద్రమ్మ(90) ఈ రోజు కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ స్మశాన వాటికలో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్దరు సంతానం. వారిలో రాధాకృష్ణ రెండో కుమారుడు. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీకి ఈమె నాయనమ్మ అవుతారు.
ఇక టాలీవుడ్ లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలను నిర్మించి అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ చివరగా మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాని నిర్మించారు. పవన్ కళ్యాన్ తో అత్తారింటికి దారేది, అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు నిర్మించారు.