KS Ramarao: మీకు తెలియకుండానే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా..? ప్రధాని మోదీకి ప్రముఖ నిర్మాత లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత కేఎస్ ప్రధాని మోదీకి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయించిందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు ఆయన

New Update
KS Ramarao: మీకు తెలియకుండానే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా..? ప్రధాని మోదీకి ప్రముఖ నిర్మాత లేఖ

KS Ramarao: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత కేఎస్ ప్రధాని మోదీకి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయించిందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు ఆయన. "మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో.. అందుకు సహకరించిన మీ పార్టీపై కూడా అంతే కోపం ఉంది. కానీ 2014 ఎన్నికల్లో మీకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీటు వచ్చిందంటే అది చంద్రబాబు వల్లనే" అని పేర్కొన్నారు.

నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయనకు 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తన రాష్ట్ర ప్రజల బాగు కోసం కాదనుకున్న వ్యక్తి అన్నారు. రాజకీయాల్లో మీ కంటే సీనియర్ అని తెలిపారు. బీజేపీ కేవలం తొమ్మిది రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీరు ఇలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో మరింత నష్టపోవాల్సి వస్తుందని రామారావు మోదీకి హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న అగ్నిని మీరు గమనించండి. ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

అలాగే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబందం లేదని.. కానీ, రాష్ట్ర పౌరుడిగా, భారత పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయినట్లు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు మీరూ వచ్చారు అని గుర్తు చేశారు. ఆ తర్వాత 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా.. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన మొదలుపెట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రధానిగా మీకున్న అధికారంతో అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండని కోరారు. ఆ చర్యతో తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని కేఎస్ రామారావు సూచించారు.

ఇది కూడా చదవండి: పెదనాన్న కోసం నారా రోహిత్ భారీ స్కెచ్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు