Ashwani Dutt : టికెట్ రేట్లపై ఆ అపోహలు వద్దు.. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు : నిర్మాత అశ్వినీదత్

నిర్మాత అశ్వినీదత్ 'కల్కి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అందులో టికెట్ రేట్ల గురించి పలు అపోహలు వచ్చాయని పేర్కొంటూ తన ట్విట్టర్ లో దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

New Update
Ashwani Dutt : టికెట్ రేట్లపై ఆ అపోహలు వద్దు.. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు : నిర్మాత అశ్వినీదత్

Producer Ashwani Dutt About Movie Ticket Prices : టాలీవుడ్ సీనియర్ నిర్మాత, వైజయంతీ మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ ఇటీవల రిలీజ్ అయిన 'కల్కి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ.700 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అశ్వినీదత్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనగా.. అందులో టికెట్ రేట్ల గురించి పలు అపోహలు వచ్చాయని పేర్కొంటూ తన ట్విట్టర్ లో దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Also Read : కుమారి ఆంటీకి సోనూసూద్ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్..!

" ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహాలకు వస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల గురించి ప్రతిసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని కూలంకషంగా చర్చించుకుని సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు, అది ఒక వారమా? 10 రోజులా? అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి CBN గారు తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి ప్రేక్షకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలసికట్టుగా తీసుకుందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు" అని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు