YCP MLA Rachamallu Siva Prasad Reddy: ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ అయినప్పటికీ..ఇంకా కొన్ని చోట్ల మాత్రం కులాంతర వివాహాలకు పెద్దలు ఒప్పుకోవడం లేదు సరికాదా..? అవసరం అయితే ఆ జంటలో ఎవరో ఒకరిని చంపేస్తున్నారు కూడా. కాలం మారుతున్న కానీ కొన్ని చోట్ల కట్టుబాట్లు పేరుతో ప్రేమ పెళ్లిళ్లకు ఒప్పుకోవడం లేదు.
ఈ క్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పెద్ద కుమార్తె పల్లవి వివాహాన్ని ఆమె ప్రేమించిన వ్యక్తితో ఓ ఆలయంలో చాలా నిరాడంబరంగా జరిపించారు. ముందుగా కుమార్తెను, అల్లుడిని తీసుకుని ఆయన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెళ్లి జరిపించగా..ఆ తరువాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
ఎమ్మెల్యే పెద్ద కుమార్తె పల్లవి చదువుకుంటున్న రోజుల్లో ఆమె స్నేహితుడిని ప్రేమించారు. ఆ విషయం ఇంట్లో చెప్పగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో వారి వివాహాం నిరాడంబరంగా జరిగింది. పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. డబ్బు, కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. పిల్లల ఇష్టానికి అనుగుణంగా పెళ్లి చేయించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.
పిల్లల ఇష్ట ప్రకారమే ప్రేమ వివాహం జరిపించానని ఎమ్మెల్యే తెలిపారు. అంతస్తులో తక్కువ అయినప్పటికీ వారిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడంతో ఈ వివాహానికి ఒప్పుకున్నానని ఆయన తెలిపారు. కులం, మతం అనేవి చూడకుండా పెళ్లి జరిపించినట్లు ఆయన వివరించారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ సీనియర్ నేతగా ఉన్నారు.
ఆయన రెండో సారి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడప (Kadapa) జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరు అయిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ..కుమార్తె వివాహాన్ని చాలా సింపుల్ గా ఆమెకు నచ్చిన మెచ్చిన వ్యక్తితో జరిపించడంతో జిల్లా వ్యాప్తంగా ఆయన పై ప్రశంసలు కురుస్తున్నాయి.