Crime News: ప్రొద్దుటూరు వ్యాపారి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌ లో మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి.!

విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో దూకి ప్రొద్దుటూరు వ్యాపారి సుబ్బారావు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌లో మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి పేరు ఉంది. ఆయన బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

New Update
Crime News: ప్రొద్దుటూరు వ్యాపారి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌ లో మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి.!

Vijayawada: విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో పరిశీలించగా వారికి సూసైడ్‌ నోట్‌ లభ్యం అయింది.

Also Read: పెను విషాదం.. 49 మంది మృతి.. 140 మంది గల్లంతు..!

సూసైడ్‌ నోట్‌లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి పేరు ఉంది. ఆయనతోపాటు పలువురి ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేకు పలువురు వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వడ్డీకి ఇప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు