Priyanka Gandhi: మోదీ మాటల్లో వాస్తవాలు ఉండవు.. ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని మోదీ చెప్పే మాటల్లో వాస్తవాలు ఉండవని అన్నారు ప్రియాంక గాంధీ. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే మోదీ మాట్లాడుతారని విమర్శించారు. ఎన్నికలు రాగానే మోదీకి భయం వస్తుందని.. ఇందిరాగాంధీని చూసి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని మోదీకి సూచించారు.

New Update
Priyanka Gandhi Comments: మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

Priyanka Gandhi: మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో (Maharashtra) జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ మాటలు ఎటువంటి నిజాలు కలిగి ఉండవని, ఎన్నికల సమయంలో ఓట్లు సేకరించడం కోసమే ఆయన మాట్లాడుతారని విమర్శించారు.

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అందులో నిజం ఉండదు. ఆయన ఏం మాట్లాడినా ఎన్నికల కోసమే. అవినీతి కోసమే ఒంటరిగా పోరాడుతున్నానని మోదీ చెప్పారు. మీకు శక్తి, అన్ని వనరులు ఉన్నాయి. ప్రపంచంలోని నాయకులందరూ మీ వెంటే ఉన్నారు. మీరు ఒంటరిగా ఎలా ఉండగలరు? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వచ్చి తనను తిట్టారంటూ మోదీ ఏడుస్తారని ఎద్దేవా చేశారు. మోదీ ఇందిరా గాంధీ నుండి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కానీ, ఆయన ఆమె నుండి నేర్చుకోలేరు ఎందుకంటే మీరు అంత గొప్ప మహిళను దేశ వ్యతిరేకి అంటారు." అని అన్నారు.

"కాంగ్రెస్ రాజకీయ సంప్రదాయానికి పునాది మహాత్మాగాంధీ వేశారని.. సత్యమార్గంలో నడవాలని ఆయన అన్నారు. దానిని అనుసరించి కాంగ్రెస్‌ నాయకులందరూ ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతుడని తెలుసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం మా కర్తవ్యం. మీ జీవితాన్ని అర్థం చేసుకోవడం మా బాధ్యత, కానీ బీజేపీది అందుకు విరుద్ధమైన సిద్ధాంతం. వారు మీ సంస్కృతిని అర్థం చేసుకోరు, గౌరవించరు. అవకాశం దొరికినప్పుడల్లా మీ సంస్కృతిని మార్చేందుకు ప్రయత్నిస్తారు... గిరిజన వర్గాలపై ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా బీజేపీ పెద్ద నేతలు మౌనంగా ఉన్నారు." అని వ్యాఖ్యానించారు.

Also Read: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన తల్లి విజయమ్మ!

Advertisment
తాజా కథనాలు