/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Priyanka.jpg)
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మెడాన్ ప్రధాన పాత్రల్లో నట్టించిన యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రపంచం వ్యాప్తంగా ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ కు అమెజాన్ సంస్థ భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ సిటాడెల్ కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. దీంటో క్రిటిక్స్ నుంచి సిటాడెల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొవల్సి వస్తోంది.
అమెజాన్ లో టాప్ షోల లిస్టులో సిటాడెల్ లేదు. దీంతో అమెజాన్ కు భారీగా నష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తలపట్టుకుంటున్నట్లు సమాచారం. సిటాడెల్ ఇచ్చిన షాక్ తో ఆండీ జెస్సీ ప్రస్తుతం అమెజాన్ నిర్మిస్తున్న అన్ని ఫోల బడ్జెట్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారట. ఈ వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.
అయితే సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం అమెజాన్ దాదాపు 250 మిలియన్ డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో 2000కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ సిటాడెల్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అనే టాక్ వినిపిస్తోంది. సిటాడెల్ తో అమెజాన్ సంస్థకు బ్రేకులు వేసినట్లయ్యింది.
అయితే 9నెలల్లో అమెజాన్ నిర్మించిన ఆరు బిగ్ షోలు కూడా అపజయాన్ని మూటగట్టుకున్నాయి. వీటిపై కూడా అమెజాన్ సీఈవో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి రిపోర్టు తెప్పించుకున్నారట. దీని ఫలితం అమెజాన్ ఉద్యోగులపై కూడా పడుతోందని వర్గాలు అంటున్నాయి. వెబ్ సిరీస్ ల నష్టం కారణంగా డిమాండ్ లేని ప్రాజెక్టులు చేస్తున్న పదివేల మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సిటాడెల్ సిరీస్ 8 ఎపిసోడ్స్ కు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో 6వ ఎపిసోడ్ కు బిస్తర్ చుట్టేశారట. గత కొన్ని నెలల్లో అమెజాన్ సంస్ధ డైసీ జోన్స్ అండ్ దిసిక్స్, పవర్, డెడ్ రింగ్, వంటి షోలను ఒక్కొక్క దానిని వంద మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తూ...ఏ ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. వీటిన్నింటికి తోడు ఇప్పుడు సిటాడెల్ అనే పిడుగు అమెజాన్ నెత్తి మీద పడింది.