Om Bheem Bush: ఓటీటీలోకి ‘ఓం భీమ్ బుష్’.. గందరగోళం ఖాయం..!

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఓం భీమ్ బుష్'. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 12నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రకటించారు.

Om Bheem Bush:  ఓటీటీలోకి  ‘ఓం భీమ్ బుష్’.. గందరగోళం ఖాయం..!
New Update

Om Bheem Bush: ప్రియదర్శి, శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు కలిసారంటే కామెడీ మామూలుగా ఉండదు. ‘బ్రోచేవారెవరురా’ నవ్వులు పూయించిన ఈ ట్రియో.. ‘ఓం భీమ్ బుష్’ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Nithya Menon: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..!

హాస్యభరితమైన టైటిల్ తోనే సినిమా పై ఆసక్తిని పెంచిన ఈ మూవీ మార్చి 22న థియేటర్స్ లో విడుదలైంది. ప్రియదర్శి, శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రిలీజైన మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. లాజిక్స్ పక్కన బెడితే హాయిగా నవ్వుకోవడానికి ఇదొక మంచి సినిమా అన్నట్లుగా తెరకెక్కించారు దర్శకుడు శ్రీహర్ష. 10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్స్ మంచి లాభాలనే తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.

publive-image

‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ రిలీజ్

అయితే  థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా 'ఓం భీమ్ బుష్' డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. "ముగ్గురు శాస్త్రవేత్తలు.. ఓ వైల్డ్ ట్రెజర్ హంట్.. గందరగోళం ఖాయం" అంటూ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలిపారు.

publive-image

‘ఓం భీమ్ బుష్’ కథ 

ఈ సినిమా కథ ముగ్గురు శాస్త్రవేత్తలైన క్రిష్, వినయ్, మాధవ్ ల చుట్టూ తిరుగుతుంది. భైరవకోన అనే గ్రామంలో నిధిని వెతకడానికి వెళ్లిన ఈ ముగ్గురికి ఎదురైన సవాళ్లు.. ఈ క్రమంలో జరిగే సన్నివేశాలే ఏంటీ అనేది ఈ సినిమా కథ. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటించగా.. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి కీలక పాత్రల్లో కనిపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read: Vijay Devarakonda: ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా.. ఆ బ్యాచ్ కు రౌడీ మేనమామ కౌంటర్!

#om-bheem-bush-ott-release #om-bheem-bush-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe