పుతిన్ పతనం మొదలైనట్లేనా..? రష్యాలో సైనిక తిరుగుబాటు

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కష్టాలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ మిలీషియా వాగ్నర్ గ్రూప్ పుతిన్‎ను టార్గెట్ చేశాయి. పుతిన్‎ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటుకు యత్నిస్తున్నాయి. దీంతో మాస్కోలో పెద్ద సంఖ్యలో దళాలను మోహరించారు. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖపై తిరుగుబాటు చేశారు. యుద్ధంపేరుతో తన దళంలోని చాలా మందిని రష్యా హతమార్చిందని దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
పుతిన్ పతనం మొదలైనట్లేనా..? రష్యాలో సైనిక తిరుగుబాటు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పోరులో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కష్టాలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆ దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖపై తిరుగుబాటు చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని వీడియోలలో, యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యా రక్షణ మంత్రిని తొలగించినట్లు ప్రకటించారు. అదనంగా, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన రోస్టోవ్-ఆన్-డాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి యెవ్జెనీ తన యోధులను కూడా పంపించాడు.

putin problems increased

పుతిన్‎ను వెంటాడుతోన్న భయం:
తిరుగుబాటు భయంతో, రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసేందుకు మాస్కోలో ట్యాంకులను మోహరించాలని పుతిన్ ఆదేశించారు. తన ప్రైవేట్ మిలీషియా, వాగ్నర్ గ్రూప్, తనను అధికారం నుండి తొలగించడానికి తిరుగుబాటుకు ప్రయత్నించవచ్చని పుతిన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలో, మాస్కో వీధుల్లో ట్యాంక్ లు కనిపించాయి. క్రెమ్లిన్ చుట్టూ సైనిక వాహనాలను కూడా భారీగా మోహరించారు.

శక్తివంతమైన కిరాయి దళం వాగ్నర్ అధిపతి యెవ్ జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారని ఆరోపిస్తూ..రష్యా అతన్ని అరెస్టు చేయాలని ఆదేశించింది. యెవ్జెనీ ప్రిగోజిన్, మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన తారాస్థాయికి చేరుకుందని TASS వార్తా సంస్థ తెలిపింది. వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడిందని..క్రెమ్లిన్ ఆరోపించిన అనంతరం, వాగ్నర్ ఫైటర్లు ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దాటి రష్యాలోకి ప్రవేశించారని..మాస్కో సైన్యానికి వ్యతిరేకంగా అన్ని విధాల ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారంటూ రాయిటర్స్ నివేదించింది. ప్రిగోజిన్ ఓ ప్రకటనలో తన సైనికులను లక్ష్యంగా చేసుకుంటూ రష్యా సైన్యం దాడులకు పాల్పడుతోందని..ఈ దాడుల్లో వందలాది మంది తమ సైనికులు మరణించారని ఆరోపిస్తూ..దీనికి ప్రతీకారం పగతీర్చుకుంటామన్నారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తూ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చారు.

వాగ్నర్ గ్రూప్ అనేది ఉక్రెయిన్ లోని సాధారణ రష్యన్ సైన్యంతో కలిసి పోరాడుతున్న కిరాయి సైనికుల సైన్యం. ఈ సైన్యం అధ్యక్షుడు ప్రిగోజిన్ ఒకప్పుడు పుతిన్ కు మంచి మిత్రుడే. ఈ మధ్యకాలంలో మాస్కోతో తీవ్రవైరం పెంచుకున్నారు. సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చిన ప్రిగోజిన్..తన వాగ్నర్ బలగాలతో ముందుకు సాగేందుకు ప్లాన్ చేస్తున్నారు. రోస్టోవ్ లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ దళాలు తమ అధీనంలో తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయని మాస్కో అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు