ఢిల్లీ మెట్రోలో ప్రధాని.. ప్రయాణికులతో మాటాముచ్చట

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించారు. కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతోపాటు ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కొత్త భవనాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

New Update
ఢిల్లీ మెట్రోలో ప్రధాని.. ప్రయాణికులతో మాటాముచ్చట

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కొత్త భవనాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోడీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యూనివర్శిటీలోని నార్త్ క్యాంపస్‌లో నిర్మించనున్న డియు కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనం, అకడమిక్ బ్లాక్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.

modi delhi metro

ఈ సందర్భంగా మోడీ మెట్రో కోచ్‌లో ఉన్న ప్రయాణికులందరితోనూ చిరునవ్వు చిందిస్తూ మాటాముచ్చట సాగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. మెట్రోలో ప్రయాణించేందుకు ప్రధాని మోడీ టోకెన్ కూడా కొనుగోలు చేశారు. రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికుల్లో ఉత్సుకత నెలకొంది.

మే 1 నుంచి వేడుకలు ప్రారంభం:
శాతాబ్ది ఉత్సవాలు ఢిల్లీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని మల్టీపర్పస్ హాల్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా 3 కొత్త భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించింది. ఈ ఉత్సవాలు 1 మే 2023న ప్రారంభమయ్యాయి.

1922లో స్థాపించిన ఢిల్లీ యూనివర్సిటీ:
ఢిల్లీ విశ్వవిద్యాలయంను 1922లో స్థాపించారు. డీయూ ఈ సంవత్సరం దాని శతాబ్ది వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. చాలా రోజులుగా జరుగుతున్న వివిధ కార్యక్రమాలు నేటితో జూన్ 30తో ముగియనున్నాయి. ఈ ముగింపు కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. ఈ వేడుకకు అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరుకానున్నారు. ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కొత్త భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం 'కాఫీ టేబుల్' అనే పుస్తకాన్ని కూడా ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు