PM MODI -NACIN :నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi )నేడు ఆంధ్రప్రదేశ్ లో(AP) ఉమ్మడి అనంతపురం జిల్లాలోశ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల ,మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు. By Nedunuri Srinivas 16 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి NACIN: ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi )నేడు ఆంధ్రప్రదేశ్ లో(AP) ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా ఈరోజు జనవరి 16 ఉదయం లేపాక్షి ఆలయంలో శ్రీ వీరభద్రస్వామివారిని దర్శించుకున్నారు.లేపాక్షివీరభద్ర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టమని ప్రధాని మోడీ అన్నారు. స్వామిదర్శనం అంతరం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల ,మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ ప్రారంభించారు ప్రధాని మోదీ. రూ.1500 కోట్లతో నాసిన్ అకాడమీ ఇండియన్ రెవెన్యూ సర్వీసస్ ( IRS ) అధికారుల శిక్షణ కొరకు నూతనంగా నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్)(NACIN) శిక్షణా కేంద్రాన్ని ప్రారంరంభించారు. రూ.1500 కోట్లతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ నాసిన్ అకాడమీ పాల సముద్రం సమీపంలో 503 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, స్థానిక వైసీపి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సిఎం జగన్ ( YS JAGAN)తో కలిసి ఈ అకాడమీ భవనాలను మోడీ పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో మోడీ ముఖా ముఖి నిర్వహించారు. ALSO READ : ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్! రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ సరళంగా ఉండేది- ప్రధాని మోడీ ఇప్పటివరకు హర్యానాలో మాత్రమే ఈ ఆడకాడమీ ఉంది. ఇప్పుడు ఎపి లో నిర్మించారు. ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ .. మా ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతుందని , జీఎస్టీ రూపంలో కొత్త పన్నుల వ్యవస్థ తీసుకొచ్చామని , పన్ను మినహాయింపు 2 లక్షల నుంచి 6 లక్షలకు పెంచామని అన్నారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ సరళంగా ఉండేదని , ఆదాయంపన్ను చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోందని , రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయని అన్నారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలి. శ్రీరాముడుని దేశ ప్రజలందరూ ప్రేరణగా తీసుకోవాలని రామరాజ్యం గొప్పతనం గురించి మాట్లాడారు.ఎల్లపుడు ధర్మం వైపే నిలుస్తానని మాట తప్పని రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రామ రాజ్యభావన నిజమైన ప్రజాస్వామ్యమని మహాత్మా గాంధీ సైతం చెప్పడం జరిగిందని అన్నారు. అక్రమ మార్గంలో వచ్చేది ఇంద్రప్రస్థమైనా నాకు అక్కర్లేదని రాముడు అన్నారని చెప్పుకొచ్చారు. పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారు పేరు అని చెప్తూ .. అయోధ్య రామ విగ్రహం ప్రాణ ప్రతిష్టకు 11 రోజుల ముందు అనుష్టానం చేస్తున్నానని తెలియజేసారు. ALSO READ :ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 19-27 వరకూ రైళ్లు రద్దు #andhra-pradesh #prime-minister-narendra-modi #nacin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి