అప్పుడు సామాన్యుడిగా బయట నుంచి వైట్ హౌస్ చూశాను..!!

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ వైట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అప్పుడు సామాన్యుడిగా అమెరికాకు వచ్చానని..నాడు వైట్ హౌస్ ను బయట నుంచి చూశానని..ఇఫ్పుడు ప్రధాని అయ్యాక పలుమార్లు సందర్శించానని ప్రధాని మోడీ తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు దేశగౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారని ప్రశంసించారు మోడీ.

New Update
అప్పుడు సామాన్యుడిగా బయట నుంచి వైట్ హౌస్ చూశాను..!!

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వైట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవం వందనం స్వీకరించారు. ప్రధాని గౌరవ సూచికంగా 19గన్ సెల్యూట్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పలు ఒప్పందాలపై బైడెన్, మోడీలు సంతకాలు చేశారు.

modi white house

అనంతరం మోడీ మాట్లాడారు. అగ్రరాజ్యంలో తనకు దక్కిన గౌరవం 140కోట్ల మంది భారతీయులకు 4 మిలియన్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని మోడీ అభివర్ణించారు. 3 దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికాకు వచ్చానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. నాడు వైట్ హౌస్ ను బయట నుంచి చూశానని ప్రధాని అయ్యాక పలుమార్లు చూస్తున్నానని తెలిపారు.

.ఇక జో బైడెన్ మాట్లాడుతూ..భారత్, అమెరికాల మధ్య బంధం చాలా గొప్పదని..రెండు దేశాలు 21వ శతాబ్దపు గమనాన్ని నిర్వహింగలవన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా ఇరు దేశాలు కలిసి పనిచేయడం చాలా అవసరం అన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, ఆహారం వంటి అంశాల్లో భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా జో బైడెన్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు