అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టు బయలుదేరిన మోడీ..!!

అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్రమోడీ ఈజిప్టు రాజధాని కైరో బయలుదేరారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ఆహ్వానం మేరకు ఆయన ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు. అక్కడ చారిత్రాత్మక మసీదును సందర్శించనున్నారు. ప్రధాని మోడీ ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన హెలియోపోలిస్ వార్ మెమోరియల్‌ని సందర్శించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తారు.

New Update
అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టు బయలుదేరిన మోడీ..!!

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్ట్ రాజధాని కైరో బయలుదేరారు. ప్రధాని మోడీ ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన హెలియోపోలిస్ వార్ మెమోరియల్‌ని సందర్శించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్, పాలస్తీనాలో మరణించిన సుమారు 4000 మంది భారతీయ సైనికులకు స్మారక చిహ్నం. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు.

pm modi egypt

చారిత్రత్మక మసీదును సందర్శించనున్న మోడీ:
బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునర్నిర్మించిన అల్ హకీమ్ మసీదును ప్రధాని మోడీ సందర్శించనున్నారు. ఈజిప్ట్‌ పర్యటనలో భాగంగా మార్చిలో ఈజిప్ట్‌ అధ్యక్షుడు భారత పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏర్పడిన ‘ఇండియా యూనిట్‌’తోనూ ప్రధాని మోడీ సంభాషించనున్న సంగతి తెలిసిందే. ఈ యూనిట్‌లో పలువురు ఉన్నత స్థాయి మంత్రులు ఉన్నారు.

వ్యాపారం,ఆర్థిక సహకారంపై చర్చ:
ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌సీసీతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వ్యాపార, ఆర్థిక సహకారానికి సంబంధించిన కొత్త రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది.

వ్యూహాత్మక సంబంధాలలో బలం:
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈజిప్ట్‌లో పర్యటించాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. భారతదేశం, ఈజిప్టు మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు సంవత్సరాలుగా లోతుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల సైన్యాలు తొలి సంయుక్త విన్యాసాన్ని నిర్వహించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు