కుటుంబ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్ భోపాల్ లో మంగళవారం నిర్వహించిన మేరా బూత్..సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ… కుటుంబ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. అటు ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. కరుణానిధి కుటుంబం బాగుండాలంటే డీఎంకేకు మీరు ఓటు వేయండి. సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండి. కానీ మీరు మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ.
2024ఎన్నికల కోసం బీజేపీని ఓడించాలని ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆ పార్టీలన్నీ అవినీతి కుంభకోణాలతో ముడిపడి ఉన్నాయి. అవినీతిపరులను ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మీకు హామీ ఇస్తున్నా అంటూ మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీకి కార్యకర్తలో బలమన్నారు. తాను ఏసీ రూంలో కూర్చుని ఆదేశాలు చేయనని..ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి ధైర్యంగా ఉంటానంటూ తెలిపారు.
परिवार के नाम पर वोट मांगने वालों ने अपने परिवार का भला कर लिया। अगर आपको अपने बेटे-बेटियों का भला करना हो तो भाजपा ही एकमात्र विकल्प है। pic.twitter.com/oZbfHhQB5c
— Narendra Modi (@narendramodi) June 27, 2023