ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు బహిరంగసభలో మెదీ ప్రసంగించనున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 12.15కి వరంగల్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నేతలంతా వరంగల్‌లో మోదీ పర్యటన నేపథ్యంలో పలు ఏర్పాట్లను దగ్గరుండి మరి చూసుకున్నారు. అంతేకాకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వరంగల్ సీపీ వెల్లడించారు. ఇక ప్రధాని వరంగల్‌లో ఏం చెప్పబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ తెలంగాణకి ఏం హామీలు ఇవ్వనున్నాడోనని రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటూ బీజేపీ, ఇటూ బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ నేపథ్యంలో ప్రధాని వరంగల్ పర్యటన రాష్ట్రంలో కీలకంగా మారింది. ఇదిలా ఉంటే మామునూర్ ఎయిర్‌పోర్ట్, ఖాజీపేట రైల్వే జోన్‌కు సంబంధించి ప్రధాని మోదీ నోరు విప్పుతారా లేదా అనేది మాత్రం నేతలు పెదవి విప్పడం లేదు, మరి వరంగల్ జిల్లాకు రావడం కాదు.. జిల్లాలోని పలు ముఖ్యమైన విషయాలను పట్టించుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. అయితే దీనిపై ప్రధాని మోదీ ఏం వరాలు ఇస్తాడో అనేది వేచి చూడాల్సిందే.