PM Modi : ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసు.. .ఈసారి 50శాతంపైనే ఓట్లు: మోడీ..!!

ఈసారి ఎన్డీఏ కూటమి 50శాతానికి పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 2024లో పూర్తి మెజార్టీతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయన్న మోడీ...ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసన్నారు.

PFI వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉంది... మోదీ సంచలన వ్యాఖ్యలు..!!
New Update

ఎన్డీఏకు (NDA) వరుసగా మూడోసారి అధికారాన్ని ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మంగళవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM MODI) అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ల శాతం 50కి పైగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రతికూలత’తో ఏర్పాటైన కూటమి ఎప్పటికీ విజయం సాధించదని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దేశంలో రాజకీయ సుస్థిరత తీసుకురావడానికి ఎన్డీఏ ఆవిర్భవించిందన్నారు మోడీ.

publive-image

'అధికారం బలవంతంగా పొత్తు పెట్టుకున్నప్పుడు, అవినీతికి పాల్పడే ఉద్దేశ్యంతో పొత్తు పెట్టుకున్నప్పుడు, కుటుంబ విధానంతో పొత్తు పెట్టుకున్నప్పుడు, కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు..' అలాంటి పొత్తు దేశానికి తీరని నష్టం కలిగిస్తుందని మోడీ అన్నారు. దేశంలో రాజకీయ పొత్తులకు సుదీర్ఘ సంప్రదాయం ఉందని, అయితే ప్రతికూలతతో ఏర్పాటైన కూటమి ఎప్పటికీ విజయవంతం సాధించదన్నారు.

90వ దశకంలో దేశంలో అస్థిరత తీసుకురావడానికి కాంగ్రెస్ (Congress) పొత్తులు పెట్టుకుందని గుర్తు చేశారు. 1998లో ఎన్డీఏ ఏర్పడిందన్న మోడీ, అయితే ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారం సాధించడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్డీఏ(NDA) ఎవరికీ వ్యతిరేకంగా ఏర్పడలేదని, ఎవరినీ అధికారం నుంచి దింపేందుకు ఎన్డీఏ ఏర్పడలేదన్నారు మోడీ (modi). దేశంలో సుస్థిరత తీసుకురావడానికి ఎన్డీయే ఏర్పడింది. ఒక దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ దేశం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది, అది దేశ తత్వాన్ని మారుస్తుంది మోడీ వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ అర్థాన్ని వివరించిన మోడీ:
ఇటీవలే ఎన్డీఏ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ 25 ఏళ్లు ప్రాంతీయ ఆకాంక్షల అభివృద్ధి నెరవేర్చడానికి కారణమయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధికి ఎన్డీఏ అండగా నిలుస్తుందన్నారు. ఎన్డీఏలో ఎన్ అంటే 'న్యూ ఇండియా', డి అంటే 'డెవలప్ మెంట్' ఎ అంటే 'ఆస్పిరేషన్' అని ఆయన అన్నారు. నేడు యువత, మహిళలు, మధ్యతరగతి, దళితులు, అణగారిన ప్రజలు ఎన్డీఏను విశ్వసిస్తున్నారు. ఎన్డీఏ అటల్ బిహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee) వారసత్వం అని, దానిని రూపొందించడంలో ఎల్‌కె అద్వానీ ( Lk adwani) కూడా ముఖ్యమైన పాత్ర పోషించారని, ఆయన మనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారన్నారని ఈ సందర్భంగా ప్రధానిమోడీ అన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe