మూడు రోజుల పర్యటన కోసం అమెరికా బయలుదేరిన ప్రధాని మోడీ..!!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు బయలుదేరారు. ఈరోజు అంటే మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 1.30గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోరస్ బేస్ లో ల్యాండ్ అవుతారు. అక్కడి భారతీయ అమెరికన్ బ్రుందం మోడీకి ఘనస్వాగతం పలకనుంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా భావిస్తున్నారు.

New Update
మూడు రోజుల పర్యటన కోసం అమెరికా బయలుదేరిన ప్రధాని మోడీ..!!

భారత ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి అమెరికాకు పయనమయ్యారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21 తెల్లవారుజామున 1.30గంటలకు వాషింగ్టన్ ల్యాండ్ అవనున్నారు. అక్కడి భారతీయ అమెరికన్ బ్రుందం మోడీకి ఘన స్వాగతం పలుకుతారు. మోడీ పర్యటన భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా భావిస్తున్నారు. 2019లో అధికారకం చేపట్టిన తర్వాత మోడీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ప్రధాని పర్యటనపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి.

modi america tour

జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తారు. జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఇది కాకుండా, జూన్ 22న వాషింగ్టన్‌లో ఉభయసభల సంయుక్త సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. అదేరోజు అధ్యక్షుడు బిడెన్, అతని భార్య జిల్ బిడెన్ ప్రధానమంత్రి మోడీకి వైట్ హైజులో ఘనస్వాగతం పలికేందుకు విందును ఏర్పాటు చేశారు. అమెరికా రాజకీయాలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ విందులో పాల్గొంటారు.

పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం:
శుక్రవారం అంటే జూన్ 23న ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో పలువురు పెద్ద పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అదేరోజు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గౌరవార్థం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రధాని ఈజిప్ట్‌కు బయల్దేరతారు.

ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్, డ్రోన్ ఒప్పందాలు ఖరారు?
జూన్ 22న వాషింగ్టన్‌లో అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యం రక్షణ, అత్యాధునిక సాంకేతికత రంగంలో భవిష్యత్తు కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం. ఇందులో భాగంగా రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు, ఆయుధాలను కలిసి తయారు చేయడంతోపాటు అమెరికా కంపెనీలకు చెందిన అత్యాధునిక రక్షణ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయడంతో పాటు ఎజెండాను రూపొందించే అవకాశం ఉంది.టెలికమ్యూనికేషన్, స్పేస్, సెమీకండక్టర్ వంటి కొత్త టెక్నాలజీ రంగంలో నమ్మకమైన సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం కూడా ఈఎజెండాలో ఉంది. ఈ సమయంలో, రెండు పెద్ద రక్షణ ఒప్పందాలను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. వీటిలో జిఇతో భారతదేశంలో డ్రోన్, ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీకి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు