New Parliament Building : పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవన్‎కు చేరుకున్న ప్రధాని, ఎంపీలు..!!

పాతపార్లమెంట్ భవన్ నుంచి కొత్త పార్లమెంట్ భవన్ లోకి అడుగు పెట్టారు ప్రధాని సహా ఎంపీలు. ఇవాళ మధ్యాహ్న కొత్త పార్లమెంట్ భవనంలోకి మొదటి అడుగు పెట్టారు. పాతపార్లమెంట్ భవన్ నుంచి ప్రధాని మోదీ సహా ఎంపీలు పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవన్ కు చేరుకున్నారు. అనంతరం కొత్త పార్లమెంట్ భవన్ లో జాతీయ గీతం ఆలపించి సమావేశాలను ప్రారంభించారు.

New Update
New Parliament Building : పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవన్‎కు చేరుకున్న ప్రధాని, ఎంపీలు..!!

పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంకు ప్రధాని, సహా ఎంపీలు పాదయాత్రగా వెళ్లారు. మధ్యాహ్నం కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ లో మంగళవారం ఎంపీలు సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధానితో పాటుకేంద్ర మంత్రులు, రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా సహా పలువురు ఎంపీలు పాత పార్లమెంట్ భవన్ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోని అడుగుపెట్టారు.

సెంట్రల్ హాల్‌లో కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఎంపీలు రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్ తదితరులు పార్లమెంట్ కొత్త భవనంలోకి ప్రవేశించారు.

అనంతరం కొత్త పార్లమెంట్ భవనంలో జాతీయ గీతాలాపనతో పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త సంకల్పంతో భారతదేశం కొత్త పార్లమెంటు భవనానికి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.


జైన సంవత్సరాది సందర్భంగా ఎంపీలు, దేశప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ‘మిచ్చామి దుక్కాం’ అన్నారు. 'మిచ్చామి దుక్కడం' అనేది ప్రాకృత భాషా పదం, ఇందులో మిచ్చామి అంటే 'నన్ను క్షమించు', దుక్కడం అంటే 'చెడు పనులు'. సంవత్సరంలో ఇలా చెప్పడం ద్వారా, ప్రజలు గత సంవత్సరంలో తెలిసి లేదా తెలియక చేసిన తప్పు పనులకు క్షమించమని అడుగుతారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు