ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ముర్ము పాల్గొంటారు. ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రానికి చేరుకుని..అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతిభవన్ కు చేరుకుంటారు. రాష్ట్రపతి నిలయంకు పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు.
తన పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దన్న ఉద్దేశ్యంతో సాయంత్రం 5గంటలకు హెలికాఫ్టర్ లో గచ్చిబౌలి స్టేడియానికి వెళ్తారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో ముర్ము పాల్గొంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల ద్రుష్ట్రా వాహనాల రాకపోకలను మళ్లించినట్లు తెలిపారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకునే మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు:
-హనుమాన్ ఆలయం, హకీంపేట్ Y జంక్షన్ సమీపంలో..
-బొల్లారం చెక్ పోస్ట్
-నేవీ జంక్షన్
-యాప్రాల్ రోడ్
-హెలిప్యాడ్ వై జంక్షన్
-బైసన్ గేట్
-లోతుకుంట
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 06 గంటల మధ్య ట్రాఫిక్ నిలిపివేస్తారు.
-బొల్లారం
-అల్వాల్
-లోతుకుంటా
-తిరుమలగిరి
-ఖార్ఖానా
-జేబీఎస్
-ప్లాజా జంక్షన్
-పీఎన్‌టీ ఫ్లైఓవర్
-హెచ్‌పీఎస్ అవుట్ గేట్
-బేగంపేట్ ఫ్లైఓవర్
-గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్
-మోనప్ప జంక్షన్
-పంజాగుట్ట
-జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్
-రోడ్ నెం. 45 జంక్షన్