మోడీ మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు..ఆ బాధ్యత కేంద్రమంత్రులకే..!!

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సహా.. ప్రభుత్వ మార్పు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన అజెండా 2024 లోక్‌సభ ఎన్నికలే. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలతో మిగతా రాష్ట్రాల్లో పకడ్బందీగా అడుగులు వేస్తోంది.

New Update
నేడు మోడీ కీలక సమావేశం..కేబినెట్‎లో మార్పులకు ఛాన్స్..!!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో బుధవారం అర్థరాత్రి బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సహా.. ప్రభుత్వ మార్పు, పార్టీ సంస్థాగతంపై చర్చించారు. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఏడాది చివర్లో జరగనున్న ప్రధాన అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. అయితే ప్రధాని మోడీ విదేశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ భేటీ జరగడం హాట్ టాపిగ్గా మారింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

publive-image

విదేశీ పర్యటన నుంచి దేశానికి తిరిగి వచ్చిన తర్వాత మోడీ భోపాల్ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు కట్టుబడిఉందని ప్రకటించారు. ఈ ప్రతిపాదన చాలా కాలాంగా బీజేపీ మేనిఫెస్టోలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అటు కేంద్ర మంత్రి వర్గంలోనూ భారీ మార్పులకు కూడా ఈ భేటీ చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కర్నాటకలో ఓటమి తర్వాత ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. నాలుగు ముఖ్యమైన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో రివాల్వింగ్ డోర్ ట్రెండ్‌ను, మరో ఇద్దరిలో అధికార వ్యతిరేక వేవ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ భావిస్తోంది.

రాష్ట్రాలకు మంత్రులే..
సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు పరోక్షంగా సీఎం అభ్యర్థులను కేంద్రమంత్రులను పంపించాలని ఈ సమావేశంలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విధానంతో ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి సీఎంలకు గట్టిపోటీ ఇవ్వగల నేతలను బరిలోకి దింపాలని గులాబీదళం భావిస్తోంది. కర్నాటక ఓటమి కారణాల్లో ఇది ఒకటని..అక్కడ కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థులుగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి బలమైన నేతలు ఉండగా...బీజేపీ నుంచి సీఎం బసవరాజ్ బొమ్మై తన బలాన్ని నిరూపించలేకపోయారు. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుని కేంద్రమంత్రులను పంపించాలని కమలనాథులు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు