Relationship tips: మీ గతం మీ ప్రస్తుత ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అయితే ఇది చదవండి! మొదటి ప్రేమ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే. కొన్నిసార్లు పరిస్థితులు కుదరక విడిపోతారు. తర్వాత కొత్త లవ్ లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. అయితే మీ గత సంబంధం మీ కొత్త ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తే సమస్యలు తప్పవు. అటాచ్మెంట్ స్టైల్, రొమాన్స్, ఇలా అనేక విషయాల్లో ఏ ఇద్దరి మధ్య పోలికలు ఉండవని గుర్తుపెట్టుకోండి. By Trinath 15 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి జరిగిందేదో జరిగిపోయింది.. పాస్ట్ ఈజ్ పాస్ట్.. ప్లాష్‌బ్యాక్‌లోనే ఉంటే అసలు సినిమా ఇచ్చే మజాను మిస్ అవుతాం. ఈ విషయం అందరికి తెలుసు.. అయినా కూడా చాలామందిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. గతంలో ప్రేమ విషయంలో జరిగిన పొరపాట్లు పదేపదే గుర్తొస్తాయి. కొత్త ప్రేమ జీవితంలోకి అడుగుపెట్టినా కూడా పాత ఘటనలే మనల్ని తరముతుంటాయి. దీని వల్ల కొత్త లవ్ పార్టెనర్ చాలా ఇబ్బందులు వస్తాయి. అబ్బాయిలు, అమ్మాయిల్లో కొంతమంది ఇలానే ఉంటున్నారు. తొలి ప్రేమ ఫెయిల్ అవ్వడానికి జరిగిన పరిణామాలను కొత్త ప్రేమతో ముడి పెడుతుంటారు. ఇలా చేయవద్దు. నిజానికి చాలామందికి తమ బిహెవియర్ ఇలా ఉంటుందని తెలియదు.. పాత ప్రేమ కొత్త ప్రేమను ప్రభావితం చేస్తుందన్న విషయం కూడా అర్థంకాదు. ప్రతీకాత్మక చిత్రం మీ గత ప్రేమ బంధం కొత్త లవ్‌ని ప్రభావితం చేస్తోందని సంకేతాలు: నమ్మకం లేకపోవడం: గత రిలేషన్‌లో బ్యాడ్ ఎక్స్‌పిరియన్స్‌లు ఉంటే అవి కొత్త సంబంధంలో ఆందోళనలకు దారితీస్తాయి. కొత్త భాగస్వామిని విశ్వసించడం కష్టమవుతుంది. అందుకే పాత లవ్‌ని కొత్త ప్రేమతో కంపేర్ చేసి చూడకుడదు. సెల్ఫ్ రెస్పెక్ట్: విఫలమైన బంధం కారణంగా ఆత్మగౌరవం లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ కారణంగా సంబంధిత వ్యక్తి తరచుగా 'నేను అంటే ఎవరికి ఇష్టముండదు' లేదా 'నేను నీకు తగిన వ్యక్తిని కాదు' లాంటి భావాలతో పోరాడతాడు. ప్రతీకాత్మక చిత్రం పోలికలు: ప్రతి భాగస్వామి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటుంది. ఏ రిలేషన్‌లోనైనా ప్రత్యేకతను గుర్తించి ముందుకు వెళ్లాలి. పాత వాటితో కంపేర్ చేస్తూ ఉండకూడదు.. ఆ అమ్మాయి అయితే ఇలా చేసేది.. ఈ అబ్బాయి అయితే ఇలా చేసేవాడు అని అనవద్దు.. ఇది లవర్‌కు ఇరిటేషన్ తెప్పిస్తుంది. తెలియని భయం: భవిష్యత్తు ఎలా ఉంటుందో, కొత్త భాగస్వామి ఎలా ఉంటాడో, వారి విలువలు, లక్షణాలు లేదా ఇంట్రెస్ట్‌లు అనుకూలంగా ఉంటాయో లేదో అనే భయం కొత్త సంబంధాన్ని ప్రారంభించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రతీకాత్మక చిత్రం అటాచ్మెంట్ స్టైల్: పాతవారితో ఉన్న బాండింగ్ కొత్తవారితో స్టార్టింగ్‌లో ఉండకపోవచ్చు. అందుకే పాత ప్రేమ పదేపదే గుర్తుకురావచ్చు. ఇదే విషయాన్ని కొత్త లవర్ దగ్గర అదే పనిగా ప్రస్తావించకూడదు. అటాచ్మెంట్ స్టైల్ అందరితోనూ ఒకే రకంగా ఉండదు. రొమాన్స్: కొంతమంది రొమాన్స్ విషయంలోనూ పాత అనుభూతులు కలగడంలేదని ఫీల్ అవుతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు.. మీరు కనుక ఇలా ఉన్నారంటే ఫ్యూచర్‌లో మీరు ఏ పార్టనెర్‌తోనూ కలిసి ఉండలేరు. ఇది మానసిక సమస్య కూడా కావొచ్చు. రొమాన్స్ అందరితో ఒకే రకంగా ఉండదు..ఇది తప్పక తెలుసుకోవాలి. ALSO READ: నైట్ టైమ్ ఇలా చేయండి.. ఉదయం నిద్రలేచే సరికి మీ చర్మం మెరిసిపోతుంది! #love-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి