TET EXAM: టెట్ పరీక్షాకేంద్రంలో తీవ్ర విషాదం.. 8 నెలల గర్భిణీ మృతి

తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్‌ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్‌ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు.

TET EXAM: టెట్ పరీక్షాకేంద్రంలో తీవ్ర విషాదం.. 8 నెలల గర్భిణీ మృతి
New Update

TET EXAM: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్‌ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్‌ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షకు టైమ్ అయిపోతుందనే కంగారులో పరీక్షా కేంద్రానికి వేగంగా చేరుకున్నారు. ఈ తరుణంలో ఆమెకు ఒక్కసారిగా చెమటలు పట్టి బీపీ పెరిగి పరీక్షా గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన ఇన్విజిలేటర్, తోటి అభ్యర్థులు, పోలీసులు, సిబ్బంది సాయంతో ఆమెను అంబులెన్స్‌లో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.

8 నెలల గర్భిణీ అయినా కూడా టెట్ పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివిందని భర్త అరుణ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కనేందని వాపోయారు. తీరా పరీక్ష రాయడానికి వస్తే హాలులోనే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోందని బోరున విలిపించాడు. అటు రాధిక ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1139 పరీక్షా కేంద్రాల్లో మొత్తం రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌ ముగియగా, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్షను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపించనున్నారు.

ఇది కూడా చదవండి: నీలోఫర్ ఆసుపత్రిలో ఆర్నెల్ల చిన్నారి అదృశ్యం

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి