/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mixcollage-30-jul-2024-10-54-pm-2552-1722360292.jpg)
Preeti Sudan:UPSC కొత్త ఛైర్‌పర్సన్ గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు UPSAC లో సభ్యురాలిగా ఉండేవారు. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు. కాగా ఇటీవల యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ప్రీతి సూదన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 1న UPSC ఛైర్‌పర్సన్ గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
నకిలీ ఐఏఎస్ వ్యవహారం వల్లే?..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవీ కాలం ముగియడానికి ఐదేళ్ల ముందు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పదవి నుంచి వైదొలగుతున్నట్లు సోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మనోజ్ సోనీ దాదాపు పదిహేను రోజుల క్రితం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి.
ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చుట్టూ ఉన్న వివాదాలు.. ఆరోపణలతో రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలవల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు సోనీ UPSC చైర్మన్‌గా మే 16, 2023న ప్రమాణ స్వీకారం చేశారు. అతని పదవీకాలం మే 15, 2029తో ముగియనుంది.