Preethi: నాన్న ఆ ఒక్కటి చేయవద్దని కండీషన్‌ పెట్టారు.. కావాలంటే అందుకు ఓకే..!

ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్ ప్రీతి పగడాల పతంగ్‌ అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. అవకాశం వస్తే ఇంటిమేట్‌ సీన్లతో పాటు లిప్‌లాక్‌ వంటి వాటికి ఓకే చెప్తావా అని అడిగితే.. అందుకు ఆమె నో అంటూ తేల్చిచెప్పింది.

New Update
Preethi: నాన్న ఆ ఒక్కటి చేయవద్దని కండీషన్‌ పెట్టారు.. కావాలంటే అందుకు ఓకే..!

Preethi Pagadala: ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్ ప్రీతి పగడాల సోషల్‌ మీడియాలో ఎంత పాపులర్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికన్ యాసెంట్‌లో తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన యూజర్స్‌కు బాగా టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ.

publive-image

Also Read: పొలిటికల్ యాక్షన్ మూవీగా గేమ్ ఛేంజర్..రిలీజ్ ఎప్పుడంటే?

తాజాగా, ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పతంగ్‌ అనే మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెడుతుంది. రిసెంట్ గా ప్రీతి పగడాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అవకాశం వస్తే ఇంటిమేట్‌ సీన్లతో పాటు లిప్‌లాక్‌ వంటి వాటికి ఓకే చెప్తావా అని యాంకర్ తనను ప్రశ్నించారు.

publive-image

Also Read: ఇండస్ట్రీ ఎవడి సొత్తు కాదు.. అందుకే నేనంటే హీరోలకు నచ్చదు!

అందుకు ప్రీతి నో అంటూనే ఇలా చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి అడుగుపెడుతున్నప్పుడు నాన్న లిప్‌లాక్‌ సీన్లు వద్దని కండీషన్‌ పెట్టారని తెలిపింది. తాను అడిగిన ప్రతిదానికి వారు అంగీకరించారని.. అలాంటప్పుడు పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ను దాటకూడదని నిర్ణయించుకున్నానంది.

publive-image

ఒకవేళ పరిమితిమేరకు ఇంటిమేట్‌ సీన్లు ఉంటే చేస్తానంది. గ్లామర్‌గా కనిపిండంలో ఎలాంటి కండీషన్లు లేవని.. ఎందుకంటే ఈ రోజుల్లో ఎటూ షార్ట్‌గా ఉన్న డ్రస్‌లను ఉపయోగించడం సాధారణమని కామెంట్స్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు