Holi: హొలీ రంగుల నుంచి జుట్టును కాపాడుకోవడానికి.. ఇలా చేయండి

హోలీ సమయంలో రంగుల నుంచి జుట్టు, మొహం, చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి. ఇవి రంగుల్లోని కెమికల్స్ వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి కాపాడతాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Holi: హొలీ రంగుల నుంచి  జుట్టును కాపాడుకోవడానికి.. ఇలా చేయండి
New Update

Holi: హొలీ అనగానే రంగుల పండుగ. ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకుంటారు ఈ పండగను. రంగులు పూసుకోవడమే వరకు బాగానే ఉంటుంది. కానీ దాని తర్వాత జుట్టు, చర్మం, మొహం అంతా రంగులతో పాడవుతుంది. అందుకే హొలీ ఆడేముందు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే రంగుల నుంచి మీ మొహం, చర్మం, జుట్టును కాపాడుకోవచ్చు.

జుట్టుకు నూనె రాయండి

హొలీ ఆడడానికి వెళ్లే ముందు జుట్టుకు కొబ్బరి నూనె లేదా ఏదైనా ఆయుర్వేద నూనెను అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టును రంగుల నుంచి రక్షిస్తుంది.

publive-image

హెయిర్ మాస్క్ అప్లై చేయండి

జుట్టు పై రంగులు పడిన తర్వాత షాంపూ చేయడానికి ముందు 20-30 నిమిషాల పాటు హైర్ మాస్క్ ను ధరించండి. పెరుగు, ఉసిరి, షీకాకాయి తో చేసిన హెయిర్ మాస్క్ ధరిస్తే జుట్టుకు ఉన్న రంగును తొలగించడంలో అద్భుతంగా పని చేస్తాయి.

జుట్టును కట్టుకోవడం

హొలీ ఆడేముందు జుట్టును దగ్గరకు కట్టుకోవాలి. ఇలా చేస్తే రంగు జుట్టంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది రసాయనాల వల్ల జుట్టు రాలే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేయండి

రంగులను తొలగించడానికి వేడి నీటిని వాడడం ద్వారా జుట్టు దెబ్బతింటుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా వేడి నీళ్లు జుట్టుకు మంచిది కాదు. అందుకే గోరు వెచ్చ నీళ్లు లేదా చల్ల నీటిని మాత్రమే వాడాలి.

కండీషనర్ అప్లై చేయాలి

సాధారణంగా జుట్టుకు రంగులు పట్టినప్పుడు వాటిని తొలగించడానికి షాంపూ ఎక్కువగా చేస్తాము. ఇలా చేయడం ద్వారా జుట్టు పొడిబారుతుంది. జుట్టును హైడ్రేటెడ్, మాయిశ్చరైజింగ్ గా ఉంచడానికి మంచి పోషకాలున్న హెయిర్ కండీషనర్ అప్లై చేయాలి.

తేలికపాటి షాంపూఅప్లై చేయండి

జుట్టు పై రంగులను వదిలించడానికి తేలికపాటి షాంపూలను ఉపయోగించాలి. అధిక ఘాడత ఉన్న షాంపూలు జుట్టును మరింత దెబ్బతీస్తాయి. సున్నితమైన రసాయనాలు లేని షాంపూలు జుట్టును సంరక్షిస్తాయి.

Also Read: NBK109 Glimpse : బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

#skin-care-during-holi #holi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe