Homs Remedies: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే అంటు వ్యాధులు పరార్ వర్షాకాలంలో ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. తులసి, పసుపు, అల్లం టీ, అవిసె గింజలు, ఉసిరితో చేసిన నీటిని తాగితే వర్షాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Remedies: వర్షాకాలం అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్ల సోకుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే పరిశుభ్రతను పాటించడంతోపాటు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. వైరల్ ఇన్ఫెక్షన్లు, గొంతులో నొప్పి, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్లు, ఫ్లూ, కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లను ఈ కాలం మరింత ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అత్యంత సాధారణ జ్వరం. జ్వరం అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, జబ్బుల నుంచి త్వరగా కోలుకునేందుకు అనేక ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించటం వల్ల జలుబు, ఫ్లూ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పసుపు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గోరువెచ్చని పాలలో చిటికెడ్ పసుపు కలుపుకుని తాగితే.. మంట, కీళ్ల అసౌకర్యం, కడుపు సమస్యలు, ఫ్లూ, జలుబుతోపాటు అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి. తులసి: తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్‌లతో పోరాడే లక్షణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. జలుబు, దగ్గు, ఫ్లూతో ఇబ్బంది ఉంటే తులసి ఆకులను తింటే ఉపశమనం ఉంటుంది. తులసి యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అల్లం టీ: అల్లం టీ ఫ్లూ, సాధారణ జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే షోగోల్స్, జింజెరాల్స్ వంటి సమ్మేళనాలు వాటి ఔషధ గుణాలను శరీరంలోకి విడుదల చేస్తాయి. తాజా అల్లం ముక్కలను వేడినీటిలో వేసుకుని తాగవచ్చు. అవిసె గింజలు: అవిసెగింజల్లో పోషకాలు, ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. ఇవి ఫ్లూ, జలుబుకు వ్యతిరేకంగా పనిచేసి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కప్పు నీటిలో అవిసె గింజలను ఉడకబెట్టి ఆ నీరు తాగితే బాక్టీరియా, ఫ్లూ నుంచి శరీరాన్ని రక్షించి ఉపశమనం పొందవచ్చు. ఉసిరి: ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధకశక్తిని, జీవక్రియను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గుకు కారణమయ్యే సూక్ష్మక్రిములను దూరం చేస్తాయి. అనేక అనారోగ్యాలను దూరం చేయడానికి రోగనిరోధకశక్తిని ఇస్తుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం.. రవ్వతో నేతి హల్వా ఇలా చేయండి! #homs-remedies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి