/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pravalika-family-jpg.webp)
Pravalika : ఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక (Pravalika) కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటించారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగమిస్తామని ప్రకటించారు. ప్రవళిక కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ రోజు ప్రగతి భవన్ లో ప్రవళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం అని ఈ సందర్భంగా కేటీఆర్ ఆన్నారు. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
ఇది కూడా చదవండి:Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర
యువతా.. ప్రతిపక్షాల చిల్లర రాజకీయాల ఉచ్చులో పడొద్దు!
ప్రవళిక కుటుంబానికి తగిన న్యాయం చేస్తాం.. అన్ని విధాలుగా అండగా ఉంటాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRSpic.twitter.com/oKWvtlBZUa
— BRS Party (@BRSparty) October 18, 2023
కేటీఆర్ తో సమావేశం అనంతరం ప్రవళిక సోదరుడు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ తన సోదరి మృతి కేసు విషయమై డీజీపీతో మాట్లాడారని చెప్పారు. తమకు అండగా ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ప్రవళిక మరణించిన సమయంలో నిర్వహించిన ఆందోళన విషయంలో పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు చెబుతున్నారు. కేసులు నమోదైన వారిలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, నీలిమ, జీవన్ తదితరులు ఉన్నారు.