/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Dowleswaram-Barrage.jpg)
Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లను ఢీకొట్టిన పడవుల యజమానుల ఆచూకీ పోలీసులు కనుక్కున్నారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‍కు చెందిన పడవలుగా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే పడవలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కుట్ర కోణం వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. పడవలను ఢీ కొట్టిన వ్యవహారాన్ని సీరియస్‍గా తీసుకుంది ప్రభుత్వం.
బ్యారేజి గేట్లు రిపేర్...
ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాహుబలి మిషన్ రంగంలోకి దిగింది. ఇటీవల 2 భారీ పడవులు ఢీకొని బ్యారేజిలోని 67, 69 గేట్లు విరిగిపోయాయి. విరిగిపోయిన గేట్ల కౌంటర్ వెయిట్స్ ఇప్పటికే అధికారులు తొలిగించారు. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.
67, 68 , 69 గేట్ల మధ్య ఇరుక్కుపోయిన 2 భారీ పడవలను బయటకు తీసేందుకు ప్రత్యేక బాహుబలి మిషన్‌ను అధికారులు తెచ్చారు. 67, 69 గేట్లను మూసేసి భారీ పడవలను బయటకు తీసి విరిగిపోయిన గేట్లకు కౌంటర్ వెయిట్స్ బిగిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ జెండా రంగులో ఉన్న పడవలు ఢీకొన్నాయి అని.. ఇది వైసీపీ నేతలు కుట్ర అని సోషల్ మీడియాలో టీడీపీ విమర్శల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ అడిగిన కుట్ర అని ఆరోపణలు చేస్తోంది.