టోక్యో ఒలింపిక్స్‌కు ముందే భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ విడిపోయారు. ప్రస్తుతం ఆమె కొరియా కోచ్ టాంగ్‌తో కలిసి శిక్షణ పొందుతున్నారు. అలాగే మరో ఇండోనేషియా కోచ్ దగ్గర సైతం ఆమె శిక్షణ పొందుతోంది. ఈ సందర్భంగా సింధు గోపీచంద్ ను కాదని ప్రకాష్ పదుకొణెని తన గురువుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమెతో పాటు కామన్వెల్త్ ఛాంపియన్ లక్ష్య సేన్ కూడా బెంగళూరులోని ప్రకాష్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందటం విశేషం. ఇదిలా ఉంటే పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్ పతకంపై కన్నేసింది. 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్ కోసం ఆమె తయారు శిక్షణ పొందుతున్నారు. ఇందుకోసం ఆమె హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.
ప్రకాష్ పదుకొణెని తన గురువు అని ప్రకటించిన పివి సింధు:
పారిస్ ఒలింపిక్స్ కు ముందు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె వద్ద పీవీ సింధు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోంది. ఇదే విషయమై ఆమె ట్వీట్ చేస్తూ, 'ఇప్పుడు నన్ను తరచూ అడుగుతున్న వారికి చెబుతున్నాను. ప్రకాష్ పదుకొణె నా గురువుగా మారారు. నేను ఆగస్టు చివరి నుండి పదుకొణె సర్ వద్ద శిక్షణ పొందుతున్నాను. గురువు కంటే ఎక్కువగా, ఆయన నాకు మార్గదర్శి, అన్నింటికంటే ఎక్కువగా ఆయన నా స్నేహితుడు. నాలోని సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఆయనతో నేను కనెక్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సార్ నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీతో శిక్షణ పూర్తి చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను" అని పీవి సింధు రాసుకొచ్చారు.
గోపీచంద్ సారథ్యంలో సింధు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.:
ఇదిలా ఉంటే పివి సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ తోపాటు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచింది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. అప్పుడు ఆమెకు కోచ్ గా పుల్లెల గోపీచంద్ ఉన్నారు. అలాగే 2016లో రియో ఒలింపిక్స్‌లో సింధుకు రజత పతకం వచ్చినప్పుడు కూడా గోపీచంద్ ఆమెకు కోచ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె మూడో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతోంది. పారిస్ ఒలింపిక్స్ కు ముందు మాత్రం ఆమె గోపీచంద్‌ను కాదని ప్రకాష్ పదుకొనేను తన గురువుగా ఎంపిక చేసుకోవడం గమనార్హంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం…యూపీలో హలాల్ ఉత్పత్తులు నిషేధం..తక్షణమే అమల్లోకి…!!