Balineni : మాజీ మంత్రి బాలినేని కి పొమ్మనలేక పొగపెడుతున్నారా ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా రాజకీయం విబ్బినం. ఎప్పుడు? ఎవరూ? ఎందుకు? పార్టీ మారుతారో అర్థం కాని పరిస్థితి. అందులో YSRCP మోతాదు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనస్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇందుకు నిదర్శనం.

New Update
Balineni : మాజీ మంత్రి బాలినేని కి పొమ్మనలేక పొగపెడుతున్నారా ?

Balineni Srinivasa Reddy:  రాష్ట్ర రాజకీయాలలో ప్రకాశం జిల్లా రాజకీయం విబ్బినం.., ఎప్పుడూ వార్తల్లో ఉండే జిల్లా రాజకీయం ఇటీవల కాలంలో ఆ జోరు కాస్త ఎక్కువైంది.. ఎప్పుడు? ఎవరూ? ఎందుకు అలుగుతారో.. ఎందుకు పార్టీ మారుతారో, ఓకే ఇంట్లో రెండు కుంపట్ల అవతారమెత్తుతారో అర్థం కాని పరిస్థితి. అందులో YSRCP మోతాదు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనస్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇందుకు నిదర్శనం., ఎన్నికల వేల సమీపిస్తున్న ఈ సమయంలో అలకల.. అసమతీ సెగ రాష్ట్ర CM క్యాంప్ కార్యాలయం తాడేపల్లి వరకు చేరింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నప్పటికీ.., ప్రధానంగా YSRCP ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ శాఖలు బాధ్యతలు తీసుకొన్న బాలినేని రెండువసారి మంత్రివర్గ విస్తరణలో స్థానం కోల్పోవడమే అని చెప్పాలి. మంత్రి పదవిపోయిన దగ్గరనుండి పార్టీ తీరు పట్ల.. పార్టీ పెద్దల పట్ల కొంత అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందుకు మారో ప్రథాన కారణం లేకపోలేదు ..బాలినేని అతని తనయుడు ప్రణీత్ రెడ్డి పై వచ్చిన అవినీతి అరోపణలు ఒక ఎత్తు అయితే రెండవది.. అదే ఆధిపత్య పోరు.. రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ కి దగ్గర బంధువులు అయిన Y.V.సుబ్బారెడ్డి..బాలినేని శ్రీనివాసరెడ్డి కి మద్య ఆధిపత్య పోరు ఉన్న మాట పాతదే అయినప్పటికీ ఎప్పుడూ కొత్తగా ఉండే వీరిమధ్య ఉండే విబేధం బాలినేని పదవి పోవడానికి.. కొత్త పదవి రాకపోవడానికి కారణం అని భావిస్తారు ఇక్కడి ప్రజలు.

మంత్రి పదవి ఉడిన తరువాత అంతగా చురుకుగా పార్టీ కార్యకలాపాలలో పాల్గొన లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో కంటి తుడుపుగా ఇచ్చిన మూడు జిల్లాల ఇంచార్జీ పదవి నచ్చని బాలినేని ఎప్పుడూ అసహానంగానే పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ వచ్చేవాడు. ఏమైందో ఏమోగాని కొన్ని నెలల క్రితం ఎటువంటి హడావిడి లేకుండా ఆ పదవికి కూడా రాజీనామా చేసిన బాలినేని జిల్లా, నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం అవడం.. భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు వార్తలు బయటికి వచ్చాయి.. గత కొంత కాలం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఫ్లెక్సీల లో సాక్షాత్తు CM జగన్ ఫోటో లేకుండా వేశారని వార్త గుప్పుమంది..ఏమనుకొన్నరో ఏమోగాని కొన్ని క్షణాల వ్యవధిలోనే వాటిని తొలగించినా.. ప్రజలలో ఏర్పడిన అనుమానం పోలేదు.

ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మార్కాపురం శాసనసభ్యులు జంకే వెంకట రెడ్డి బాధ్యతలు చేపడుతున్నా.. పార్టీ పగ్గాలు బాలినేని చేతుల్లోనే ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో బాలినేని అనుచరులుగా ఉన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, భవనం శ్రీనివాస్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడటం.. ఈ పంచాయితీ కాస్త జిల్లా ఇంచార్జీ విజయసాయి రెడ్డి,YS జగన్ మధ్య చెర్చే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇటీవల కాలం లో బాలినేని పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను కండించినా.. అనుమానాలకు సమాధానం దొరకలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఒంగోలు MP గా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని, మరియు ఒంగోలు శాసన సభ స్థానానికి ప్రాతినిద్యం వహిస్తున్న బాలినేని కాదని YSRCP నుండి వేరే పేర్లు.. అంటే పార్లమెంట్ స్థానానికి YCP నుండి మాజీ TTD ఛైర్మన్ Y.V.సుబ్బారెడ్డి...అతని తనయుడు Y.V.విక్రాత్ రెడ్డి శాసనసభ స్థానానికి పోటీలో ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. నిప్పు లేనిదే పొగ రాదనే సామెతగా అంతా అదే అనుకొంటున్న సమయంలో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట.. శాసనసభ స్థానానికి బాలినేని YCP పార్టీ తరుపున పోటీలో ఉంటామని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పాడు బాలినేని, ఈ సంఘటనల వెనుక అసలు విషయం ఏమిటో ఆ పెరుమాళ్లకే ఎరుక..! ఇదిలా కొనసాగుతున్న సమయంలో నెల్లూరు,తిరుపతి,ప్రకాశం జిల్లాల YCP ఇంచార్జీ బాధ్యతలు విజయసాయిరెడ్డి చేపట్టిన తరువాత పలుమార్లు బాలినేని కలవడం వెనుక పరమార్థం మాత్రం వాళ్లే చెప్పాలి.

ఇంత గందర గోళం మద్య బాలినేని పోటీ చేసే స్థానం మారుతుందని.. అసలు పార్టీనే మారుతున్నట్లు పుకారులు వినిపిస్తున్నాయి. ఒకపక్క బాలినేని YCP లోనే ఉంటాడని విజయసాయి రెడ్డి సమీక్ష సమావేశంలో చెప్పినప్పటికీ.. తనకు తెలియకుండా తన అనుచరులను సస్పెండ్ చేయడం.. కొంత అవమానమే అయినప్పటికీ,మొదటి నుండి YS కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉన్న బాలినేని ఈ పరిస్థితులలో పార్టీ మారుతున్నట్లు.. కొంతమంది TDP నాయకులతో టచ్ లో ఉన్నట్లు ఇటీవలకాలంలో బాగా వినిపిస్తున్న వార్త. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ YCP లో ముసలం ఆ పార్టీ కి జరిగే నష్టమేమో గాని ప్రతిపక్ష పార్టీలో మాత్రం పండగ చేసుకుంటున్నారు.అసలు ఒంగోలులో పార్టీ నుండి ఎవరు బరిలోనుండనున్నారు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే బాలినేని అని అనుకొంటున్న., సరైన స్పష్టత కోసం.. పార్టీ పెద్దల ప్రకటన కోసం , లేదా ఎన్నికల నోటిిఫికేషన్ వరకు ఎదూరు చూడక తప్పడం లేదు. ఇంత గందరగోళంలో బాలినేని పార్టీ మారితే ఇక్కడ YCP కి సరి అయిన అభ్యర్థి ఎవరూ?
ఒకవేల కొత్త అభ్యర్థి వస్తే పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఆదరిస్తారా? ఒకవేళ బాలినేని TDP నుండి బరిలో ఉంటే ఇప్పుడున్న TDP అభ్యర్థి పరిస్థితి ఏమిటీ? ఒంగోలు నియోజకవర్గం తోపాటు పలు నియోజకవర్గాల లో ప్రభావం చూపగల బాలినేని నీ YCP దూరం చేసుకొంటుందా? అనేటివంటి అనేక ప్రశ్నలు ఈ మధ్య నియోజకవర్గ ప్రజలకు సమాధానం దొరకని ప్రశ్నలుగా ఉన్నాయి.

Also Read: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, “ఏపీ క్విట్ జగన్ ” నినాదం ఊపందుకుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు