KA Paul: కేఏ పాల్ ఆస్తులు, అప్పులు ఇవే..!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు.

New Update
KA Paul: కేఏ పాల్ ఆస్తులు, అప్పులు ఇవే..!

KA Paul: ఏపీలో నామినేషన్ల పర్వంతో ఎన్నికల సందడి మరింత ఎక్కువైంది. తొలిరోజే పలువురు కీలక నేతలు నామినేషన్లు వేయగా.. రెండో రోజు మరింత ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..!

అయితే, ఆయన అఫిడవిట్ లో వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన పేరిట వాహనాలు కానీ స్థిరాస్తులు కానీ అప్పులు కానీ ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట కేవలం రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు