Power lifting: షాకింగ్.. ప్రొఫెషనల్‌ పవర్ లిఫ్టర్‌గా మారిన తెలుగు నటి

క్రికెటర్స్ యాక్టర్స్ అవ్వడం.. స్పోర్ట్స్ పర్సన్స్ సినిమాల్లో నటించడం చూసే ఉంటాం. కానీ మూవీల్లో మంచి పేరు తెచ్చుకుని ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లోకి రావడం అరుదుగా వింటూ ఉంటాం. అలాంటి జర్నీనే స్టార్ట్ చేసింది తెలుగు నటి ప్రగతి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Power lifting: షాకింగ్.. ప్రొఫెషనల్‌ పవర్ లిఫ్టర్‌గా మారిన తెలుగు నటి

ప్రొఫెషనల్‌ పవర్ లిఫ్టర్‌గా మారిన తెలుగు నటి

సినీ నటి ప్రగతి గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎక్కువ తల్లి పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. ఇక లాక్‌డౌన్‌లో అయితే ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. హాట్ హాట్ ఫోటోలు పెట్టడం, డ్యాన్లు వేయడం, జిమ్‌లో వర్కవుట్లు, వెయిట్ లిఫ్టింగ్ వంటి వీడియోలు అభిమానులను ఫిదా చేశాయి. అయితే సినిమాల్లో నటించే ఈమె వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే అందుకు గల కారణాన్ని ఇప్పుడు రివీల్ చేసింది.

కొత్త జర్నీ మొదలైంది..

ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌గా మారినట్లు బాంబ్ పేల్చింది. 'కొత్త జర్నీ మొదలైంది. 2 నెలల క్రితం నా జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని నేను అసలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణం ఇది. రెండు నెలల క్రితం మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆ టార్గెట్‌ అందుకుంటాను. ప్రస్తుతానికి 250 స్కోర్‌ సాధించాను. అయితే టార్గెట్ చాలా పెద్దదిగా ఉంది. అది అందుకునేవరకు వెనకడుగు వేయను. నన్ను పవర్‌ లిఫ్టింగ్‌ వైపు ఎంకరేజ్‌ చేసిన వారందికీ ధన్యవాదాలు'అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అవ్వడంతో పాటు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

20 ఏళ్ల వయసులోనే పెళ్లి.. 

చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ప్రగతి.. అవకాశాలను సరిగా వినియోగించుకోలేకపోయాయని ఓ ఇంటర్వ్యూలో బాధపడింది. ఓ హీరోతో జరిగిన వివాదం వల్ల పూర్తిగా సినిమాలు చేయడం ఆపేసి 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఇంకో పెళ్లి చేసుకోకుండా పిల్లలతో కలిసి జీవిస్తోంది. కానీ తర్వాత సినిమాల్లో తల్లి పాత్రలు రావడంతో అందులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఒక్కరోజు కాల్షీట్ కోసం దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తుందట. పెద్ద సినిమాలకు ఒకలా.. చిన్న సినిమాలకు మరోలా అందుకుంటుందట.

Advertisment
Advertisment
తాజా కథనాలు