Pragathi serious on her second marriage rumours: ప్రముఖ నటి ప్రగతి.. రెండో పెళ్లంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అది కూడా స్టార్ ప్రొడ్యూసర్ ను ప్రగతి పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రోడ్యూసర్ యే ఆమెకు ప్రపోజల్ పెట్టగా.. ఆమె యాక్సెప్ట్ చేసినట్లు చాలా వరకు వార్తలు వినిపించాయి. ఇక వీరి పెళ్లి త్వరలో జరగనుందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారడంతో నటి ప్రగతి ఘాటుగా స్పందించారు.
Also Read: అయ్యో ..మంచు విష్ణుకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!!
ప్రగతి ఏమన్నారంటే.. "నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం. మీరు ఒక సంస్థను నడుపుతున్నారు.. అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు.. మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్ ను ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు.. మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను.
నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు రాయడం బాధాకరం. ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే ఫర్వాలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడం ద్వారా మీడియా సంస్థను దిగజార్చకండి. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి. జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి. నాపై వార్త రాయడం మాత్రం కచ్చితంగా అనైతికం" అంటూ ప్రగతి తీవ్ర స్వరంతో విమర్శించారు. ప్రస్తుతం ఆమె పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో భార్యగా, అక్కగా, అమ్మగా నటించి మెప్పించింది. సినిమాల్లో ఎంత పద్ధతిగా ఉంటుందో.. బయట అంత బోల్డ్ గా ఉంటుంది. ఆమె తన సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ.. ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది. ఎక్స్ పోజింగ్ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు అందాలు ఆరబోస్తుంది. ఎప్పటికప్పడు తనపై వచ్చిన రూమర్స్ పైన కూడా క్లారిటీ ఇస్తుంది.